భారత్‌లో 300 ఉద్యోగాలకు యాహూ ఎసరు..?

Posted By:

ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ యాహూ! (Yahoo!) భారత్ లోని తమ బెంగుళూరు కార్యాలయంలో 300 ఉద్యోగాలకు కోత విధిస్తున్నట్లు వెబ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బెంగుళూరు కార్యాలయాన్ని తాము పునర్నర్మిస్తున్నట్లు యాహూ చెబుతున్నప్పటికి, ఉద్యోగాల కోతకు సంబంధించి ఏ విధమైన అధికారిక ప్రకటనను వెలువరించలేదు.

300 ఉద్యోగాలకు యాహూ ఎసరు..?

బెంగళూరు కార్యాలయంలో సమూల మార్పులకు తాము శ్రీకారం చుట్టామని, వినియోగదారులకు మరింత మొరుగైన సేవలను అందించడం కోసం కంపెనీని పునర్నర్మిస్తున్నట్లు యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ వెల్లడించారు.

యాహూ! (yahoo!) ఈ పేరు తెలియని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంటూ ఉండరు. విశ్వసనీయతతో కూడిన వెబ్ ఆధారిత సేవలను అందిస్తున్న అంతర్జాతీయ కంపెనీలలో యాహూ! ప్రముఖ హోదాలో కొనసాగుతోంది. ఇండియాలో బెంగుళూరు కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.

స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్‌లు ఈ సంస్థను స్థాపించారు. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఈ-మెయిల్ వంటి సేవలకు గాను యాహూ సుపరిచితం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Yahoo Set To Layoff 300 People In India!. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot