జెన్‌ఫోకస్ నుంచి సరికొత్త టాబ్లెట్ ‘మైజెన్‌టాబ్ 708బి’!

Posted By: Super

జెన్‌ఫోకస్ నుంచి సరికొత్త టాబ్లెట్  ‘మైజెన్‌టాబ్ 708బి’!

 

ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్‌ల తయారీ బ్రాండ్ జెన్‌ఫోకస్ (ZenFocus), ‘మైజెన్‌టాబ్ 708బి’ పేరుతో సరికొత్త ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.5,999. 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,  బాక్స్‌చిప్ ఏ13 చిప్‌సెట్(అనుసంధానించబడిన  మాలీ-400గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌తో), 512ఎంబి డీడీఆర్3 ర్యామ్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  టాబ్లెట్‌ను బాహ్య ప్రదేశాల్లో వినియోగించుకునేందుకు యూఎస్బీ ఇంకా కీబోర్డ్,  3జీ వయా డాంగిల్,  వై-ఫై 802.11 బి/జి/ఎన్ సపోర్ట్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ఈ డివైజ్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా  జెన్‌ఫోకస్ సీఈవో మైక్ దాల్ స్పందిస్తూ వినయోగదారుకు చవక ధరలో అత్యుత్తమ క్వాలిటీతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేసే క్రమంలో  ‘708బి’రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకన్నట్లు తెలిపారు.

జెన్ అల్ట్రా ట్యాబ్ ఏ900!

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిట్ టాబ్లెట్‌లకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ జెన్ మొబైల్ ‘అల్ట్రా ట్యాబ్ ఏ900’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ. 7,999. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జెన్ మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ గుప్తా స్పందిస్తూ 9 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో రూపుదిద్దుకున్న తమ ‘అల్ట్రా ట్యాబ్ ఏ900’ అత్యుత్తమ కంప్యూటింగ్  ఫీచర్లను ఒదిగి ఉందని తెలిపారు.

అల్ట్రా ట్యాబ్ ఏ900 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

డిస్‌ప్లే: 9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, క్వాడ్‌కోర్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ పోర్ట్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (14 గంటల వెబ్ యూసేజ్, 3.5 గంటల వై-ఫై యూసేజ్),

ఇతర ఫీచర్లు: సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా చాట్ అప్లికేషన్స్, బాలివుడ్ జేఐ ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్, మ్యాప్ మై ఇండియా నావిగేషన్ అప్లికేషన్, లైవ్ టీవీ అప్లికేషన్,

ధర: రూ.7,999, ప్రముఖ రిటైలర్ హోమ్ షాప్18 ద్వారా ఈ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్పు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot