మినీ కంప్యూటర్లు వచ్చేసాయోచ్..!!!!

Posted By: Staff

మినీ కంప్యూటర్లు వచ్చేసాయోచ్..!!!!

 

అంతర్జాతీయంగా గ్రాఫిక్ కార్డ్ సెగ్మెంట్‌లో ప్రాచుర్యం సంపాదించిన ‘జొటాక్’ వినూత్నకతకు పెద్ద‌పీట వేస్తూ మినీ కంపూటర్‌లను వృద్ధి చేసింది. డిజిటల్ సెట్‌టాప్ బాక్స్ నమూనాను పోలి ఉండే ఈ కంప్యూటింగ్ డివైజ్‌లు టెక్నాలజీ ఎదుగుదలను  సూచిస్తాయి.

ఇటీవల నిర్వహించిన కన్సూమర్ ఎలక్ట్రానిక్ షోలో జొటాక్ ఈ సెకండ్ జనరేషన్ ZBOX మినీ పీసీలను మూడు మోడల్స్‌లో ఆవిష్కరించింది. ZBOX ఐడీ 81, ఐడీ 80, ఏడీ 04 నమూనాలలో ఈ డివైజ్‌లు విడుదల కానున్నాయి. వీటి ప్రధాన ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం...

ZBOX ID 81:

* శక్తివంతమైన ఇంటెల్ కోర్ క్లెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను ఈ పీసీలో దోహదం చేశారు.

* ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ,

* హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్,

* వై-ఫై ,

* బ్లూటూత్ 3.0,

* ఐఆర్ రిమోట్,

రెండు వర్షన్‌లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్‌లో మెమరీ, హార్డ్‌డిస్క్‌లు ఉండవు. ప్లస్‌వర్షన్‌లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్‌డిస్క్‌లను లోడ్ చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.13,333, ప్లస్ వర్షన్ ధర రూ.19,999.

ZBOX ID 80:

* డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.13 GHz),

* ఎన్ - విడియా గ్రాఫిక్ వ్యవస్థ,

* 512 MB DDR3 టైప్ వీడియో మెమరీ,

* హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్,

* వై-ఫై ,

* బ్లూటూత్ 3.0,

* ఐఆర్ రిమోట్,

రెండు వర్షన్‌లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్‌లో మెమరీ, హార్డ్‌డిస్క్‌లు ఉండవు. ప్లస్ వర్షన్‌లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్‌డిస్క్‌లను నిక్ఫిప్తం చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.14,555, ప్లస్ వర్షన్ ధర రూ.19,999.

ZBOX AD04:

*  శక్తివంతమైన AMD డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1.65 GHz),

*  ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ,

*   హెచ్డీఎమ్ఐ, డివీఐ పోర్ట్స్,

*   వై-ఫై,

*   బ్లూటూత్ 3.0,

*   ఐఆర్ రిమోట్.

రెండు వర్షన్‌లలో ఈ పీసీ లభ్యం కానుంది. సాధారణ వర్షన్‌లో మెమరీ, హార్డ్‌డిస్క్‌లు ఉండవు. ప్లస్ వర్షన్‌లో 2జీబి ర్యామ్, 320 జీబి హార్డ్‌డిస్క్‌లను లోడ్ చేస్తారు. సాధారణ వర్షన్ ధర రూ.16,999. ప్లస్ వర్షన్ ధర రూ.24,555.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot