నిక్కార్సైన కంప్యూటింగ్ టాబ్లెట్!!

Posted By: Super

 నిక్కార్సైన కంప్యూటింగ్ టాబ్లెట్!!

 

నిక్కార్సైన పనితీరుతో టెక్ ప్రేమికులు విశ్వాసాన్ని చొరగునేందుకు ‘జడ్‌టీఈ’ బ్రాండ్ న్యూ లైట్ టాబ్లెట్‌ 2ను వ్ళద్థి చేసింది. స్టాండర్డ్ క్వాలిటీ కంప్యూటింగ్ కోరుకునే వారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక.

టాబ్లెట్ పనితీరు:

యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలు హెచ్చుగా ఉన్న ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ డివైజ్‌లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ ప్రాసెసర్ సామర్ధ్యం 1000 MHz. ఏర్పాటు చేసిన 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌‌ప్లే ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన వీడియో అనుభూతిని కలిగిస్తుంది.

టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగాపిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. ఈ కెమెరా వ్యవస్థ పూర్తి స్థాయి వీడియో రికార్డింగ్‌కు దోహదపడుతుంది. లోడ్ చేసిన 1024ఎంబీ ర్యామ్ వ్యవస్ధ టాబ్లెట్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంటర్నల్ మెమెరీ 4000 ఎంబీ ముఖ్య సమచారాన్ని స్టోర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ విధానం ద్వారా జీబిని 32కు వ్ళద్ధి చేసుకోవచ్చు.

ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్,ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ కనెక్టువిటీ వ్యవస్థలు టాబ్లెట్ కమ్యూనికేషన్ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ వేగవతంమైన వెబ్‌బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. ఇన్-బుల్ట్ ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థలు సుపీరియర్ అనుభూతిని అందిస్తాయి. డివైజ్ బరువు 389 గ్రాములు కావటంతో సులువుగా క్యారీ చెయ్యవచ్చు. విలువ రూ.20,000 (అంచనా మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot