టెక్ ప్రపంచానికి ఫిబ్రవరి 5 కానుక..?

By Super
|
ZTE Optik Slate coming soon


టెక్ ప్రపంచానికి ఫిబ్రవరి 5 ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టనుంది. ఉత్తమ ఫీచర్లతో విశిష్ట లక్షణాలను కలిగిన కంప్యూటింగ్ టాబ్లెట్‌ను ఈ రోజున ఆవిష్కరించనున్నారు. ZTE సంస్థ రూపొందించిన ఈ సరికొత్త డివైజ్ కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది.

‘జడ్‌టీఈ ఆప్టిక్’గా రాబోతున్న ఈ గ్యాడ్జెట్ ముఖ్య ఫీచర్లు:

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* 5 మెగా పికల్స్ రేర్ కెమెరా,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 16జీబి ఇంటర్నల్ మెమెరీ,

* 1జీబి ర్యామ్,

* 3జీ కనెక్టువిటీ,

* వై-ఫై,

* బ్లూటూత్.

పనితీరు:

యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న ఆండ్రాయిడ్ హనీకూంబ్ వోఎస్ పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. త్వరలోనే ఈ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌‌గా అప్‌డేట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాబ్లెట్ కెమెరా అంశాలను పరిశీలిస్తే వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉన్నతమైన ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. ఈ డివైజ్‌కు బ్యాటరీ మరో ప్లస్ పాయింట్‌గా భావించవచ్చు. మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-ఐయాన్ 4000 mAh బ్యాటరీని డివైజ్‌లో దోహదం చేశారు. 3జీ కనెక్టువిటీ సౌలభ్యత వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X