5,000కే ప్రపంచాన్ని చూడండి!!

Posted By: Prashanth

5,000కే ప్రపంచాన్ని చూడండి!!

 

కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ జడ్‌టీఈ ఇటీవల లాంఛ్ చేసిన సరి‌కొత్త టాబ్లెట్ కంప్యూటర్ మోడల్ ‘ఆప్టిక్ ’. ప్రత్యేకించి‌ *లో బడ్జెట్* వినియోగదారుల కోసం డిజైన్ చేయ్యిబడిన ఈ డివైజ్ కంప్యూటింగ్ అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చచటంలో పూర్తి స్థాయి పనితీరును కనబరుస్తుంది. టాబ్లెట్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే...

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్ డ్రాగెన్ 1.2 జిగా‌హెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, బ్రౌజర్ సపోర్ట్ (హెచ్‌టిఎమ్ఎల్, హెచ్‌టిఎమ్ఎల్ 5), నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ, 3జీ, మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, మల్టీ ఫార్మాట్ వీడియో ప్లేయర్, గేమ్స్, స్టీరియో స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ కనెక్టర్, 4000 mAh Li ion బ్యాటరీ, అంచనా ధర రూ.5,000.

పనితీరు:

యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న ఆండ్రాయిడ్ హనీకూంబ్ వోఎస్ పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. త్వరలోనే ఈ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌‌గా అప్‌డేట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాబ్లెట్ కెమెరా అంశాలను పరిశీలిస్తే వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉన్నతమైన ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. ఈ డివైజ్‌కు బ్యాటరీ మరో ప్లస్ పాయింట్‌గా భావించవచ్చు. మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-ఐయాన్ 4000 mAh బ్యాటరీని డివైజ్‌లో దోహదం చేశారు. 3జీ కనెక్టువిటీ సౌలభ్యత వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot