బరిలో నేను ఉన్నా..?

టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్లో తన మనుగడను కొనసాగించేందుకు జడ్‌టీఈ సంస్థ ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని రూపొందించింది. పేరు ZTE V96, ఇటీవల నిర్వహించిన సీటీఐఏ 2012 కార్యక్రమంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. సరికొత్త కంప్యూటింగ్‌కు అద్దంపట్టే విధంగా ఈ గ్యాడ్జెట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం.
టాబ్లెట్ కీలక ఫీచర్లను పరిశీలిస్తే:
- 10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- క్వాల్కమ్ 1.7గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
- ఎల్‌టీఈ బ్యాండ్ సపోర్ట్,
- 5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
- మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్.
- సిమ్‌కార్డ్ స్లాట్,
- 1జీబి ర్యామ్,
- వై-పై,
- బ్లూటూత్ కనెక్టువిటీ,
- యూఎస్బీ సపోర్ట్,
ఈ టాబ్లెట్ పీసీ ధర ఇతర వివరాలకు సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుత నెలకున్న పోటీ మార్కెట్లో, ఫీచర్లను బట్టి అంచనావేస్తే ‘ZTE V96’ సమర్థవంతంగా నిలదొక్కుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జడ్‌టీఈ ‘ఆప్టిక్ ’రూ.5000కే!!!
కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ జడ్‌టీఈ ఇటీవల లాంఛ్ చేసిన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ మోడల్ ‘ఆప్టిక్ ’.లో బడ్జెట్ వినియోగదారుల కోసం డిజైన్ చేయ్యిబడిన ఈ డివైజ్ కంప్యూటింగ్ అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చచటంలో పూర్తి స్థాయి పనితీరును కనబరుస్తుంది. టాబ్లెట్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే… 7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్ డ్రాగెన్ 1.2 జిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, బ్రౌజర్ సపోర్ట్ (హెచ్‌టిఎమ్ఎల్, హెచ్‌టిఎమ్ఎల్ 5), నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ, 3జీ, మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, మల్టీ ఫార్మాట్ వీడియో ప్లేయర్, గేమ్స్, స్టీరియో స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ కనెక్టర్, 4000 mAh Li ion బ్యాటరీ, అంచనా ధర రూ.5,000.


Click it and Unblock the Notifications








