ఈ కంప్యూటర్ ధర రూ.3,699 మాత్రమే!

Posted By: Prashanth

ఈ కంప్యూటర్ ధర రూ.3,699 మాత్రమే!

 

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ జింక్ (Zync) జడ్-909 పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని ప్రకటించింది. దీని ధర రూ.3,699. 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. టాబ్లెట్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. పీసీలో అమర్చిన 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. యూఎస్బీ పోర్ట్ సపోర్ట్‌తో పీసీని ఇతర డాంగిల్స్‌తో పాటు కీబోర్డ్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. వై-పై కనెక్టువిటీ సౌలభ్యత, బిగ్‌ఫ్లిక్స్, ఐబీబో, యాంగ్రీ బర్డ్స్ వంటి అప్లికేషన్‌లను పీసీలో ముందుగానే లోడ్ చేశారు.

మరో టాబ్లెట్ జింక్ జడ్999 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5 గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ ర్యామ్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480×800 పిక్సల్స్),

2మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇంటర్నల్ 3జీ మోడెమ్, వై-ఫై(802.11b/g/n),

8జీబి ఫ్లాష్ స్టోరేజ్,

మైక్రో ఎస్‌డి కార్డ్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

4200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గుగూల్‌ ప్లే స్టోర్, బ్రౌజర్, ఎమ్ఎస్ఎన్, గుగూల్ మ్యాప్స్, స్కైప్, ఫేస్‌బుక్….

హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ, మైక్రో ఎస్‌డి, బ్లూటూత్ 2.1.

ధర రూ.11,900

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot