జింక్ కొత్త టాబ్లెట్.. ప్రస్తుతానికి ఐసీఎస్.. త్వరలో జెల్లీబీన్!

Posted By: Prashanth

జింక్ కొత్త టాబ్లెట్.. ప్రస్తుతానికి ఐసీఎస్.. త్వరలో జెల్లీబీన్!

 

ప్రముఖ టాబ్లెట్ పీసీల తయారీ సంస్థ జింక్ గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రకటించింది. ‘జింక్ జడ్930’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్‌కు అప్‌‌గ్రేడ్ చేస్తామని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ధర రూ.5,499.

పీసీ ఇతర ఫీచర్ల విషయానికొస్తే:

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

7 అంగుళాల టీఎఫ్‌టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,

వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 3 నుంచి 4 గంటలు),

ప్రీలోడెడ్ ఫీచర్లు:

గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్, ఆడోబ్ రీడర్, వర్డ్ ఎక్సీల్, పవర్ పాయింట్, జీటాక్, వాట్స్‌ఆప్, స్కైప్, ఎమ్ఎస్ఎన్, యాహూ, బిగ్ ఫ్లిక్స్, ఐబీబో గేమ్స్, బాలీవుడ్ హంగామా, హెచ్‌టిఎమ్ఎల్, ఓపెరా మినీ బ్రౌజర్,మీడియా ప్లేయర్. ఆధునిక స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన జింక్ జడ్930, మరో ఆండ్రాయిడ్ టాబ్లెట్ కార్బన్ స్మార్ ట్యాబ్2కు గట్టి పోటీనివ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot