జింక్ నుంచి సరికొత్త ‘హైడెఫినిషన్ టాబ్లెట్’

Posted By: Prashanth

జింక్ నుంచి సరికొత్త ‘హైడెఫినిషన్ టాబ్లెట్’

 

ఇండియా ఆధారిత టెక్నాలజీ సంస్థ జింక్ గ్లోబల్ ప్రయివేట్ లిమిటెడ్, శుక్రవారం తన టాబ్లెట్ పీసీల శ్రేణి నుంచి ‘జింక్ జడ్1000’ పేరుతో సరికొత్త హైడెఫినిషన్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. 9.7 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యాన్ని కలిగిన ఈ కంప్యూటింగ్ డివైజ్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడబుల్. ధర అంచనా రూ.10,990. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్ట్, హోమ్‌షాప్18, నాప్‌టోల్, స్నాప్‌డీల్, ఇండియా టైమ్స్ ఇంకా ఇన్ఫీబీమ్‌లు ఈ పీసీని ఆఫర్ చేస్తున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ( త్వరలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),

9.7 అంగుళాల 5-పాయింట్ మల్టీటచ్ కెపాసిటివ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకునే సౌలభ్యత,

టాబ్లెట్ కొనుగోలు పై రూ.1350 విలువ చేసే లిక్రా పౌచ్, స్ర్కీన్ ప్రొటక్టర్, ఇయర్ ఫోన్స్, నెలపాటు బిగ్ ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ వంటి అదనపు సౌకర్యాలను పొందవచ్చు,

ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్పల్ ఫ్రంట్ కెమెరా,

8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

మినీ హెచ్‌డిఎమ్ఐ ఇంకా మైక్రోయూఎస్బీ పోర్ట్,

టీఎఫ్ కార్డ్ ఇంకా డీసీ పోర్ట్,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (ఐబీబో, హంగామా, ఫేస్‌బుక్).

మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot