అమెజాన్‌లో రూ.10,000 లోపు బడ్జెట్ ఫోన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...
స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం రోజు రోజుకి అధికమవుతున్నది. కొంత మంది వారి యొక్క అవసరాల కోసం రెండు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తూఉంటారు. అయితే రెండవ ఫోన్ కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా కేవలం రూ.10,000 లోపు ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే కనుక అమెజాన్‌లో ఇప్పుడు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అధిక మొత్తంలో డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తూ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. అమెజాన్‌లో 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ప్రతి రోజు ఆన్‌లైన్ వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తుంది. మీరు బడ్జెట్ విభాగంలో బ్రాండెడ్ ఫోన్లను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా HDFC బ్యాంక్ కార్డులను కలిగిన వినియోగదారులు అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. దీనితో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,490
ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.8,490 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,990 ధర వద్ద పొందవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.22-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
టెక్నో స్పార్క్ 8C ధర రూ.7,499
టెక్నో స్పార్క్ 8C స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ రూ.7,499 తగ్గింపు ధర వద్ద డైమండ్ గ్రే, ఐరిస్ పర్పుల్, మాగ్నెట్ బ్లాక్ మరియు టర్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD+ డాట్ నాచ్ డిస్‌ప్లేను 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 89.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 262ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మెమరీ ఫ్యూజన్ వర్చువల్ RAM ఫీచర్‌తో కూడా వస్తుంది. ఇది తప్పనిసరిగా ఫోన్ యొక్క RAMని 3GB వరకు పెంచి మొత్తం 6GB వరకు తీసుకుంటుంది.
వివోY15s ధర రూ.10,990
వివోY15s స్మార్ట్‌ఫోన్ 3GB RAM + 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో రూ.10,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి Funtouch OS 11.1తో ఆండ్రాయిడ్ 11 (Go ఎడిషన్) పై నడుస్తుంది. ఈ ఫోన్ 20:9 కారక నిష్పత్తితో 6.51-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.
టెక్నో స్పార్క్ 8T ధర రూ.8,999
టెక్నో స్పార్క్ 8T బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లో ఇప్పుడు 4GB RAM + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో రూ.8,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. అలాగే ఇది 91.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు ఒక గరిష్ట ప్రకాశం 500 నిట్స్ తో కూడిన 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio A35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. Tecno Spart 8Tలో ప్రత్యేక స్లాట్ ద్వారా మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/1.6 లెన్స్ మరియు AI లెన్స్‌తో పాటు క్వాడ్ LED ఫ్లాష్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications