అమెజాన్‌లో వివో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు....

స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం రోజు రోజుకి అధికమవుతున్నది. స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే క్యాష్ బ్యాక్ లతో పాటుగా డిస్కౌంట్ ధరల వద్ద లభించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అటువైపు మొగ్గు చూపుతారు. ఇటువంటి డిస్కౌంట్ ఆఫర్లను ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అందిస్తూ వినియోగదారుల యొక్క బేస్ ను రోజు రోజుకి పెంచుకొంటోంది. అమెజాన్‌లో 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ప్రతి రోజు ఆన్‌లైన్ వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తుంది. మీరు వివో బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను HDFC బ్యాంక్ కార్డులను కలిగిన వినియోగదారులు అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. దీనితో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్‌లో వివో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు

వివోY15s ధర రూ.10,990

Vivo Y15s Wave Green (3GB RAM & 32GB ROM) with No Cost EMI/Additional Exchange Offers
₹10,990.00
₹13,990.00
21%

వివోY15s స్మార్ట్‌ఫోన్‌ 3GB RAM + 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో రూ.10,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి Funtouch OS 11.1తో ఆండ్రాయిడ్ 11 (Go ఎడిషన్) పై నడుస్తుంది. ఈ ఫోన్ 20:9 కారక నిష్పత్తితో 6.51-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో P35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

వివో T1 5G ధర రూ.15,990

వివో T1 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ రూ.15,990 ధర వద్ద 6GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.16,990 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,990 ధరల వద్ద రెయిన్‌బో ఫాంటసీ మరియు స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత FunTouch OS 12తో రన్ అవుతుంది. ఇది 6.58-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. హుడ్ కింద వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCని కలిగి ఉంది మరియు గరిష్టంగా 8GB RAMతో జత చేయబడింది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/2.4 ఎపర్చర్‌తో రెండు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లను పొందుతుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందుభాగంలో f/2.0 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. 6GB మరియు 8GB RAM వేరియంట్‌లు సూపర్ నైట్ మోడ్‌తో పాటు మల్టీ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్‌ను పొందుతాయి.

వివో Y21e 5G

Vivo V21e 5G (Sunset Jazz, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
₹24,990.00
₹27,990.00
11%

వివో Y21e 5G స్మార్ట్‌ఫోన్‌ 8Gb ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.51-అంగుళాల HD+ LCD హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఇందులో హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేయడానికి డిస్ప్లే ఐ ప్రొటెక్షన్ మోడ్‌తో కూడా వస్తుంది. హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ ఇది 3GB RAMతో జత చేయబడి వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు f/2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు జత చేయబడి ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం f/1.8 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

వివో Y53s ధర రూ.18,490

వివో Y53s స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ లో రూ.18,490ధర వద్ద డీప్ సీ బ్లూ మరియు ఫెంటాస్టిక్ రెయిన్‌బో వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 పై ఫన్‌టచ్ OS11.1 తో రన్ అవుతూ 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, స్టాండర్డ్ 60HZ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటుగా 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి అందిస్తుంది.

వివో Y72 5G ధర రూ. 19,750

Vivo Y72 5G (Prism Magic, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
₹20,990.00
₹24,990.00
16%

వివో Y72 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.19,750 ధర వద్ద డైమండ్ ఫ్లేర్ మరియు రోమన్ బ్లాక్ కలర్ లలో అందించబడుతుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 11.1తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G95 SoC చేత శక్తిని కలిగి ఉండి 8GB RAM తో పాటు 3GB పొడిగించదగిన RAM ఫీచర్‌లతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో లభిస్తుంది. అలాగే ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

 

వివో Y12 ధర రూ.12,500

Vivo V11 Pro (Dazzling Gold, 6GB RAM, 64GB Storage)
₹24,990.00
₹29,990.00
17%

వివో Y21 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.12,500 ధర వద్ద డైమండ్ గ్లో మరియు మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.51-అంగుళాల HD+ LCD హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఇందులో హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేయడానికి డిస్ప్లే ఐ ప్రొటెక్షన్ మోడ్‌తో కూడా వస్తుంది. హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ ఇది 3GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే ఇది వర్చువల్‌గా 0.5GB వరకు పొడిగించే అవకాశం ఉంది. మల్టీ టర్బో 5.0ని కలిగి ఉన్న ఇతర ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఇవి డేటా కనెక్షన్, సిస్టమ్ ప్రాసెసర్ వేగం మరియు పవర్-పొదుపు పనితీరును మెరుగుపరుస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/2.2 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు f/2.4 లెన్స్‌తో 8+ 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు జత చేయబడి ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం f/1.8 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

వివో Y33s ధర రూ.18,990

Vivo Y33T (Mid Day Dream, 8GB RAM, 128GB ROM) with No Cost EMI/Additional Exchange Offers
₹18,990.00
₹22,990.00
17%

వివో Y33s స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో ఇప్పుడు 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,990 ధర వద్ద మిడ్ డే డ్రీమ్ మరియు మిర్రర్ బ్లాక్ కలర్ లలో అందించబడుతుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా మరియు ఫన్‌టచ్ ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఎల్‌సిడి డిస్‌ప్లేను 1,080x2,408 పిక్సెల్స్ తో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద మీడియాటెక్ హెలియో G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM మరియు 4GB విస్తరించిన ర్యామ్‌తో పాటుగా 128GB స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఒక f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు f/2.4 లెన్స్ తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చరుతో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది.

వివో X60 ధర రూ.34,990

వివో X60 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,990 ధర వద్ద లభిస్తుంది. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.39,990 కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,376 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 3.1 విస్తరించలేని స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX598 సెన్సార్‌ను f / 1.6 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 13-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సూపర్-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) మరియు f / 2.48 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ బోకె షూటర్ 20x డిజిటల్ జూమ్‌ మద్దతుతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X