Home
Deal of the day

అమెజాన్‌లో నేడు రూ.3000 వరకు తగ్గింపుతో లభించే స్మార్ట్‌ఫోన్లు & వాటి వివరాలు

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్ లను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు నేడు కొన్ని ఫోన్ల కొనుగోలు మీద దాదాపుగా రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ముఖ్యంగా కోటక్,ఐసీఐసీఐ బ్యాంక్ మరియు సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వారికి రూ.2,250 వరకు తగ్గింపు మరియు ఎక్సచేంజ్ మీద అదనంగా రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Deals of The Day Today Offers Up to Rs.3000 Discounts on These Smartphones

టెక్నో స్పార్క్ 8T ధర రూ.8,999

టెక్నో స్పార్క్ 8T స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ధరలో ఇటీవల ఇండియాలో లాంచ్ అయింది. 4GB RAM + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో లభించే ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.8,999 ధర వద్ద అట్లాంటిక్ బ్లూ, కోకో గోల్డ్, ఐరిస్ పర్పుల్ మరియు టర్కోయిస్ సియాన్ వంటి నాలుగు కలర్ ఎంపికలతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. అలాగే ఇది 91.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు ఒక గరిష్ట ప్రకాశం 500 నిట్స్ తో కూడిన 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio A35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/1.6 లెన్స్ మరియు AI లెన్స్‌తో పాటు క్వాడ్ LED ఫ్లాష్ ఉన్నాయి. వెనుక కెమెరా AI బ్యూటీ, AR అనిమోజీ మరియు స్టిక్కర్లు, గూగుల్ లెన్స్, టైమ్-లాప్స్, స్లో మోషన్, స్మార్ట్ పోర్ట్రెయిట్ మరియు వీడియో బోకె వంటి విభిన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.12,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది బండిల్డ్ 22.5W ఛార్జర్ మరియు 9W రివర్స్ ఛార్జింగ్ ఉపయోగించి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 11 Lite NE 5G ధర రూ.24,999

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

వివో Y73 ధర రూ. 20,990

వివో Y73 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.20,990 ధర వద్ద డైమండ్ ఫ్లేర్ మరియు రోమన్ బ్లాక్ కలర్ లలో అందించబడుతుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 11.1తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G95 SoC చేత శక్తిని కలిగి ఉండి 8GB RAM తో పాటు 3GB పొడిగించదగిన RAM ఫీచర్‌లతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో లభిస్తుంది. అలాగే ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

English summary
Amazon Deals of The Day Today Offers Up to Rs.3000 Discounts on These Smartphones.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X