అమెజాన్ దీపావళి సేల్.. ఈ వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఇయర్‌బడ్స్ ఉచితం మరియు రూ.1750 తగ్గింపు..!
పండగ సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ (Amazon Great Indian Festival Diwali Special Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు సహా గృహోపకరణాలను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును ధరకే అనేక ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మి, మోటోరోలా, రియల్‌మి సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ దీపావళి 2024 సేల్‌లో భాగంగా వన్‌ప్లన్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌పై (Oneplus Nord CE 4 Smartphone) ఆకట్టుకొనే ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేస్తే రూ.1,649 విలువైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1750 వరకు తగ్గింపును పొందవచ్చు.
ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.23,499 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,499 గా ఉంది. బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.1,750 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21,749 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ Adreno 720 GPU చిప్‌సెట్, 8GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. 30fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాతో 30fps వద్ద 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







