Home
Deal of the day

బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే రూ.2 వేల డిస్కౌంట్‌.. క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం జులైలో ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Z10R Smartphone Discount Offer) లాంచ్‌ చేసింది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, IP68 + IP69 రేటింగ్‌, క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 44 వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ.2000 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iQOO Z10R 5G smartphone

బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే రూ.2 వేల డిస్కౌంట్‌ :
ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండా కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.17498, రూ.19498, రూ.21498 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ అక్వా మెరీన్‌, మూన్‌ స్టోన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, SGS యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. మరియు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది.

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

iQOO Z10R 5G smartphone

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఐకూ స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ హామీ ఇచ్చింది.

50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ ముందు, వెనుక వైపు ఉన్న కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు ఈ ఫోన్‌ వెనుక వైపు Aura లైట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 44W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Diwali Sale 2025 Offers Rs2000 coupon code discount on iQOO Z10R 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X