అమెజాన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల మొదటి సేల్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

2022 నూతన సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. కొత్త సంవత్సరం మొదటి పండుగ సందర్బంగా ఏదైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను ముఖ్యంగా ఇటీవల లాంచ్ అయిన శామ్సంగ్ ఫోన్ ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం తన యొక్క సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ యొక్క ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ సంస్థ ఇటీవల ఇండియాలో లాంచ్ చేసిన గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందించింది. ఈ విక్రయ సమయంలో అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.5000 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల మొదటి సేల్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు..

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.58,999

Samsung Galaxy S21 FE 5G (Olive, 8GB, 128GB Storage)
₹54,999.00
₹74,999.00
27%

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

ఒప్పో A54 ధర రూ.13,999

Oppo A54 (Starry Blue, 4GB RAM, 128GB Storage) with No Cost EMI & Additional Exchange Offers
₹15,990.00

ఒప్పో A54 అమెజాన్ లో రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 4GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్OS 11.1 Liteతో ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 1,600x720 పిక్సెల్‌లు మరియు 269 పిక్సెల్‌ల పిక్సెల్ సాంద్రత (ppi)ని కలిగి ఉంది. Oppo ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో "ఐ-కేర్" స్క్రీన్ ఉంది. ఒప్పోA16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X RAM మరియు 32GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను 256GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 13 + 2 + 2-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

 

షియోమి Mi 11X 5G ధర రూ.22,999

Mi 11X 5G Cosmic Black 6GB RAM 128GB ROM | SD 870 | DisplayMate A+ rated E4 AMOLED | Upto 18 Months No Cost EMI | Additional 5000 Off on Exchange
₹26,999.00
₹33,999.00
21%

షియోమి Mi 11X 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ 6GB/ 8GB ర్యామ్ ఎంపికలతో పాటుగా 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది .

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

Redmi Note 10S (Deep Sea Blue, 6GB RAM, 64GB Storage) -Super Amoled Display | 64 MP Quad Camera | Alexa Built in
₹12,999.00
₹16,999.00
24%

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది బండిల్డ్ 22.5W ఛార్జర్ మరియు 9W రివర్స్ ఛార్జింగ్ ఉపయోగించి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X