అమెజాన్‌లో గెలాక్సీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ను ఇప్పుడు ఇండియాలోని చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం అధికంగా ఉపయోగిస్తున్నారు. అమెజాన్‌లో రోజు నిర్వహించే 'డీల్ అఫ్ ది డే' విభాగంలో కొన్ని స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద ప్రత్యేకమైన ఆఫర్లతో పాటుగా కొన్ని డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తి ఉన్న వినియోగదారులు ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ బ్రాండ్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. అలాగే HDFC బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్‌లో గెలాక్సీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

శామ్‌సంగ్ గెలాక్సీ M12 ధర రూ.11,499

Samsung Galaxy M12 (White,6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
₹11,799.00
₹15,499.00
24%

శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ రూ.11,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.14,499 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ధర రూ.20,999

Samsung Galaxy M32 5G (Slate Black, 6GB RAM, 128GB Storage)
₹16,999.00
₹23,999.00
29%

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.20,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ రూ.22,999 ధర వద్ద స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 -అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 48MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.58,999

Samsung Galaxy S21 FE 5G (Lavender, 8GB, 128GB Storage)
₹54,999.00
₹74,999.00
27%

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999

Samsung Galaxy M32 (Black, 6GB RAM, 128GB Storage) 6 Months Free Screen Replacement for Prime
₹16,999.00
₹18,999.00
11%

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధర రూ.24,999

Samsung Galaxy M52 5G (ICY Blue, 8GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display | 10% Off on HDFC Cards
₹27,999.00
₹36,999.00
24%

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.24,999 ధర వద్ద ప్రిజం డాట్ బ్లాక్ మరియు ప్రిజం డాట్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI3.1 పై రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ GM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X