Home
Deal of the day

అమెజాన్ లో అమోలెడ్ డిస్‌ప్లే ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు....

2022 నూతన సంవత్సరంలో సరికొత్త ఫీచర్స్ కలిగిన ఏదైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం తన యొక్క సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు అమెజాన్ లో అమోలెడ్ డిస్‌ప్లే ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందించింది. అమెజాన్ ఈ విక్రయ సమయంలో చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.2500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Ecommerce Site Offers More Discounts on AMOLED Display Feature Smartphones

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Oneplus nord 2 5G ధర రూ. 29,999

OnePlus Nord 2 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 మరియు 6GB RAM + 128 GB స్టోరేజ్‌ వేరియంట్ రూ. 27,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్‌హెచ్‌డి+తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 65W వార్ప్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మోనో కెమెరా వంటివి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 10 ప్రో ధర రూ.17,999

రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల అమోలెడ్ ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

షియోమి Mi 11X ప్రో 5G ధర రూ.31,999

షియోమి Mi 11X ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.31,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ ట్రూ కలర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ HDR10 +, FHD + రిజల్యూషన్, DCI-P3 కలర్ మరియు 1120nits గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఇది మైక్రోడాట్-నాచ్డ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS, EIS సెన్సార్‌ల మద్దతు కూడా ఉన్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియోల కోసం 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ప్రో వీడియో రికార్డింగ్ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, రా మోడ్ వంటి మరెన్నో ఫీచర్లను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జిపిఎస్, హై-రెస్ ఆడియో, NFC మరియు ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

English summary
Amazon Ecommerce Site Offers More Discounts on AMOLED Display Feature Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X