Amazonలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అన్నివేళల అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో కస్టమర్‌లు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. బడ్జెట్ విభాగంలో స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి వారికి 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Ecommerce Site Offers More Discounts on Buying a Budjet Smartphones

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999; 16,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M12 ధర రూ.10,999; 13,499

శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.13,499 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఒప్పో A74 5G ధరలు రూ.14,990

ఒప్పో A74 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB + 128GB వేరియంట్‌ రూ.17,990 ధరల వద్ద లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1 తో రన్ అవుతూ 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేని 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉన్న ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని పొందుతూ 8GB RAMతో జత చేయబడి ఉంటుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్‌ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 2 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో కూడిన రెండు కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉంది. అలాగే వై-ఫై, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఈ ఫోన్ 162.0x75.5x8.9mm కొలతలతో 192 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఒప్పో A15s ధర రూ.12,490

ఒప్పో A15s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,490 ధర వద్ద ఇప్పుడు అమెజాన్ లో డైనమిక్ బ్లాక్ మరియు ఫ్యాన్సీ వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో ఆఫర్‌ల భాగంగా లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.52-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,490

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.8,490 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.10,990 ధర వద్ద పొందవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.22-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

OPPO A16 ధర రూ.13,990

OPPO A16 ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ రూ.13,990 ధర వద్ద క్రిస్టల్ బ్లాక్ మరియు పెర్ల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 జీబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి, మీడియాటెక్ హీలియో జి 35 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉన్న V- ఆకారపు గీత లభిస్తుంది. ఈ OPPO ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది, ఇది పవర్ బటన్ వలె రెట్టింపు అవుతుంది. OPPO A16 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది, ఇందులో 13MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది మరియు మాక్రో మరియు మోనోక్రోమ్ షాట్‌ల కోసం రెండు 2MP కెమెరాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విభాగంలో, OPPO A16 ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్‌ఓఎస్ 11.1 పై నడుస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి .Oppo A16 ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఇది స్ప్లాష్ నిరోధకత కోసం IPX4 సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X