Amazonలో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నేటి "డీల్ అఫ్ ది డే" విభాగంలో కొన్ని స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. కస్టమర్‌లు నేటి డీల్ అఫ్ ది డే యొక్క ఆఫర్లు మరికొద్ది గంటలలో ముగియనున్నది. అధిక ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు కొద్దిగా అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు కొన్ని గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ అఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి వారికి 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Amazon Ecommerce Site Offers More Discounts on Buying High End Smartphones

Xiaomi 11 Lite NE 5G రూ.26,999

 

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

వివో X60 ధర రూ.34,990

వివో X60 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,990 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.39,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,376 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 3.1 విస్తరించలేని స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, బ్లూటూత్ v5.1 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

గెలాక్సీ S10 ప్లస్ రూ.52,999

గెలాక్సీ S10 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ప్రస్తుతం అమెజాన్ లో రూ.52,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్, 6.4-అంగుళాల క్వాడ్ హెచ్‌డి + కర్వ్డ్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే HDR10 + మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ శామ్‌సంగ్ ఎక్సినోస్ 9820 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 8GB / 12GB RAM మరియు 128GB / 512GB / 1TB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై మరియు సామ్‌సంగ్ స్కిన్ తో రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ను 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ టెలిఫోటో లెన్స్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇవి 10X డిజిటల్ జూమ్ మరియు 0.5X / 2X ఆప్టికల్ జూమ్ ను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో కూడా డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.9 ఎపర్చర్‌తో 10 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇది 4100 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతుతో పాటు వైర్డు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటి వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.

ఒప్పో రెనో 5 ప్రో 5G ధర రూ.35,990

ఒప్పో రెనో 5 ప్రో 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో రూ.35,990 ధర వద్ద ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి + OLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ సాంద్రత, 20: 9 కారక నిష్పత్తి, 92.1 శాతం స్క్రీన్ నిష్పత్తితో 402PP వద్ద 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoCను కలిగి ఉండి 8GB మరియు 12GB LPDDR4x RAM ఎంపికలతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 1.7 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కెమెరాను కలిగి ఉంటాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G ధర రూ.1,05,999

శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.1,05,999 ధర వద్ద మరియు 16GB ర్యామ్ + 512GB వేరియంట్‌ రూ.1,16,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ మొదటి సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 120 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి) ఉంటుంది. కెమెరా సెటప్ 12, 10 మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్, హైబ్రిడ్ ఆప్టిక్ 3X జూమ్ మరియు ఎఫ్ / 2.0 లెన్స్ ద్వారా 76 డిగ్రీల ఎఫ్‌ఓవి కలిగిన 64 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 80 డిగ్రీల ఎఫ్‌ఓవి 40 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది USB PD 3.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ పవర్ షేర్ కూడా ఉంది.

వన్‌ప్లస్ 9R‌ 5G ధర రూ.39,999

వన్‌ప్లస్ 9R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మీకు కేవలం 15 నిమిషాల్లోనే ఒక రోజు మొత్తానికి కావలసిన ఛార్జీని పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వన్‌ప్లస్ 9R 5G ఫోన్ వెనుక భాగంలో 48MP సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌తో నడిచే అధునాతన క్వాడ్-కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 16MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ మరియు అంకితమైన మోనో షూటర్ కూడా ఉన్నాయి.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X