Home
Deal of the day

Samsung గెలాక్సీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ఇండియాలో మొబైల్ ఫోన్ల వాడకం మొదలయ్యి చాలా రోజులు అయింది. మొదటి నుంచి కూడా నోకియా బ్రాండ్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వారు. తరువాత దానికి దీటుగా శామ్సంగ్ బ్రాండ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. తరువాత టెక్నాలజీ పెరిగే కొద్ది మొబైల్ ఫోన్లు కాస్త స్మార్ట్‌ఫోన్లుగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లోనే ఇంటర్నెట్ సాయంతో అన్ని రకాల పనులను చేస్తుండడంతో స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం రోజు రోజుకి అధికమవుతున్నది. స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ముందు తరం నుంచి కూడా తాము ఇష్టపడే శామ్సంగ్ బ్రాండ్ ఫోన్లు క్యాష్ బ్యాక్ లతో పాటుగా డిస్కౌంట్ ధరల వద్ద లభించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అటువైపు మొగ్గు చూపుతారు.

Amazon Ecommerce Todays Deals Offers More Discounts on Buying Samsung Brand Smartphones

ఇటువంటి డిస్కౌంట్ ఆఫర్లను ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. అమెజాన్‌లో 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ప్రతి రోజు ఆన్‌లైన్ వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను కలిగిన వినియోగదారులు అదనంగా రూ.3000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. దీనితో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy M52 5G స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy M52 5G 1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm Snapdragon 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UIతో రన్ అవుతుంది. ఇది 6GB RAM మరియు 128GB ఇంటర్ స్టోరేజ్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ప్రాథమిక కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్. ఇందులో 20 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Samsung Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 అమెజాన్ లో ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 26.69 cm (10.5 inch) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ , 32GB విస్తరించదగిన ROM, Wi-Fi వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్, సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11.0 ద్వారా రన్ అవుతూ డాల్బీ అట్మాస్ స్పీకర్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8MP AF + 5.0MP కెమెరా ఫీచర్లను కలిగి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7040 mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.58,999

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M33 5G ధర రూ.17,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.17,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

English summary
Amazon Ecommerce Today's Deals Offers More Discounts on Buying Samsung Brand Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X