Home
Deal of the day

Amazon Fab Phones Fest సేల్లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల ముందుకు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో మరొక సేల్ ను ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్ ధరల వద్ద చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ ప్రస్తుత విక్రయ సమయంలో SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Fab Phones Fest Sales Offers Huge Discounts on These Smartphones

Xiaomi 11 Lite NE 5G: రూ.26,999

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M12 ధర రూ.10,999; 13,499

శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.13,499 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999; 16,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధర రూ.21,999; రూ.23,999

శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.21,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.23,999 ధర వద్ద ప్రిజం డాట్ బ్లాక్ మరియు ప్రిజం డాట్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI3.1 పై రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ GM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G ధర రూ.1,05,999

శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.1,05,999 ధర వద్ద మరియు 16GB ర్యామ్ + 512GB వేరియంట్‌ రూ.1,16,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ మొదటి సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 120 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి) ఉంటుంది. కెమెరా సెటప్ 12, 10 మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్, హైబ్రిడ్ ఆప్టిక్ 3X జూమ్ మరియు ఎఫ్ / 2.0 లెన్స్ ద్వారా 76 డిగ్రీల ఎఫ్‌ఓవి కలిగిన 64 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 80 డిగ్రీల ఎఫ్‌ఓవి 40 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది USB PD 3.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ పవర్ షేర్ కూడా ఉంది.

English summary
Amazon Fab Phones Fest Sales Offers Huge Discounts on These Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X