Amazonలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...
ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధర రూ.29,999; 31,999
శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.29,999; 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.31,999 ధర వద్ద బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ కలర్ వేరియంట్లలో ఇప్పుడు అమెజాన్ లో లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై వన్ UI 3.1 తో రన్ అవుతూ 6.7-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ధర రూ.20,999; 22,999
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.20,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ రూ.22,999 ధర వద్ద స్లేట్ బ్లాక్ మరియు స్కై బ్లూ కలర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 -అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ సపోర్ట్ తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 48MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999; 16,999
శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ధర రూ.21,999; రూ.23,999
శామ్‌సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.23,999 ధర వద్ద ప్రిజం డాట్ బ్లాక్ మరియు ప్రిజం డాట్ గ్రే వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ UI3.1 పై రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చేత శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ GM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M12 ధర రూ.10,999; 13,499
శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.13,499 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M31
శామ్‌సంగ్ గెలాక్సీ M31 ఫోన్ యొక్క 6GB, 8GB ర్యామ్ వేరియంట్‌లు ఇప్పుడు అమెజాన్ లో వరుసగా రూ.18,499, రూ. 20,499 ధరల వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ మరియు ఎక్సినోస్ 9611 SoC చేత రన్ అవుతూ 6GB మరియు 8GB RAM తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్ప్లేను గరిష్టంగా 420 నిట్స్ ప్రకాశంతో కలిగి ఉంటుంది. ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 / మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX682 సెన్సార్ మరియు f / 1.8 లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే f / 2.4 ఎపర్చుర్ తో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంది . అలాగే కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం గెలాక్సీ M31s ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు స్లో-మోషన్ వీడియోలు, AR డూడుల్ మరియు AR ఎమోజి వంటి ఫీచర్ల మద్దతుతో వస్తుంది.


Click it and Unblock the Notifications