Home
Deal of the day

Amazonలో Mi బ్రాండ్ ల్యాప్‌టాప్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ఆన్‌లైన్ షాపింగ్ కోసం వినియోగదారులకు ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ లో కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ మొదలైన అనేక గాడ్జెట్‌లను కొనుగోలు చేయడం కోసం డిస్కౌంట్ల సమయం కోసం వేచిచూస్తూ ఉంటారు. ఇప్పుడు అమెజాన్ లో ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ కొన్ని వస్తువులపై రోజువారి డిస్కౌంట్ ఆఫర్లను కలిగి ఉంది. ల్యాప్‌టాప్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా షియోమి బ్రాండ్ ల్యాప్‌టాప్లను పొందాలని చూస్తున్న వారికి వాటి కొనుగోలు మీద గొప్ప తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులను ఉపయోగించి వారికి అదనంగా రూ.5000 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం కూడా ఉంది. వీటిపై గల ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Giving The Best Discount Offers on Buying Mi Brand Laptops

Mi నోట్‌బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్ ధర రూ.59,999

షియోమి బ్రాండ్ యొక్క ల్యాప్‌టాప్‌లలో Mi నోట్‌బుక్ అల్ట్రా యొక్క కోర్ i5 ప్రాసెసర్ మరియు 8GB RAM కాన్ఫిగరేషన్‌ మోడల్ ఇప్పుడు అమెజాన్ లో రూ.59,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే i5 ప్రాసెసర్ మరియు 16GB RAM కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.63,999 ధర వద్ద మరియు కోర్ i7 ప్రాసెసర్ 16GB RAM మోడల్ రూ.76,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ అల్యూమినియం ఫ్రేమ్ తో నిర్మించబడి ఉంది. ఇది విండోస్ 10 హోమ్‌తో రన్ అవుతూ 15.6-అంగుళాల Mi-Truelife+ డిస్‌ప్లే 3,200x2,000 పిక్సెల్స్, 16:10 కారక నిష్పత్తి, 90Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100 శాతం sRGB కవరేజ్, TUV రీన్‌లాండ్ తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్ మరియు DC ని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 89 శాతం స్క్రీన్ నుండి బాడీ రేషియోతో వస్తుంది మరియు ఎగువన HD వెబ్‌క్యామ్ కూడా కలిగి ఉంది. హుడ్ కింద ఇది ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో జత చేసిన ఇంటెల్ కోర్ i7-11370H CPU ను కలిగి ఉంటుంది. ఇది 1600GB DDR4 ర్యామ్‌తో 3,200MHz మరియు 512GB NVMe SSD స్టోరేజ్‌తో వస్తుంది.

Mi నోట్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్

షియోమి బ్రాండ్ యొక్క ల్యాప్‌టాప్‌లలో Mi నోట్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ యొక్క 8GB RAM మరియు ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ మోడల్ ఇప్పుడు అమెజాన్ లో రూ.56,999 ధర వద్ద మరియు కోర్ i5 + 16GB ర్యామ్ మోడల్ రూ.59,999 ధర వద్ద చివరిగా టాప్-ఆఫ్-లైన్ కోర్ i7 + 16GB ర్యామ్ మోడల్ రూ.72,999 ధర వద్ద లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 14-అంగుళాల 2.5K (2,560x1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేను 16:10 యాస్పెక్ట్ రేషియో, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇది 100 శాతం sRGB కవరేజ్, TUV రెయిన్‌ల్యాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్ మరియు DC డిమ్మింగ్ వంటివి కలిగి ఉన్నాయి. ఇది ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో 11వ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో శక్తినిస్తుంది. ఇది 16GB RAM మరియు 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. Mi నోట్‌బుక్ ప్రో కూడా Mi నోట్‌బుక్ అల్ట్రా వలె అదే కనెక్టివిటీ ఎంపికలు మరియు ఆడియో సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది 56Whr బ్యాటరీని కలిగి ఉండి 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 17.3 మిమీ మందంతో 1.4 కిలోల బరువును కలిగి ఉంది. ఇది Wi-Fi 6, బ్లూటూత్ v5.1, థండర్ బోల్ట్ 4 పోర్ట్, HDMI పోర్ట్, USB టైప్-సి పోర్ట్, రెండు USB టైప్-ఎ పోర్ట్‌లు మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. DTS ఆడియో ప్రాసెసింగ్‌తో రెండు 2W స్పీకర్ల ద్వారా ఆడియో నిర్వహించబడుతుంది.

Dell 14 (2021) థిన్ & లైట్ i3-1005G1 ల్యాప్‌టాప్

డెల్ 14 (2021) థిన్ & లైట్ i3-1005G1 ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,990 ధర వద్ద అందుబాటులో ఉంది. 4Gb RAM, 1TB HDD + 256GB SSD మరియు 14" (35.56 సెం.మీ.) FHD AG డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ (Vostro 3401, D59BE1) వేరియంట్ లో లభిస్తుంది. ఇది 10వ తరం ఇంటెల్ కోర్ i3-1005G1 ప్రాసెసర్ మరియు షేర్డ్ గ్రాఫిక్స్ మెమరీతో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డును కలిగి ఉంటుంది. అలాగే ఇది Windows 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2019 ఆపరేటింగ్ సిస్టమ్ & సాఫ్ట్‌వేర్ లను కలిగి ఉండి రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్ 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్ తో రన్ అవుతూ 14 అంగుళాల FHD డిస్ప్లైను కలిగి ఉంటుంది. ఈ బిజినెస్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉన్నప్పుడు Windows 11కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అప్‌గ్రేడ్ రోల్‌అవుట్ ప్లాన్ 2021 చివరిలో ప్రారంభమై 2022 వరకు కొనసాగడానికి షెడ్యూల్ చేయబడింది. నిర్దిష్ట సమయం పరికరాన్ని బట్టి మారుతుంది. ఇది 8GB (4GB ఆన్‌బోర్డ్ + 4GB SO-DIMM) DDR4 3200MHz RAM, 1x SO-DIMM స్లాట్‌ని ఉపయోగించి 12GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. అలాగే స్టోరేజ్ 256GB M.2 NVMe PCIe SSD ఖాళీ 1x 2.5-అంగుళాల SATA స్లాట్‌తో లభిస్తుంది. అలాగే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కలిగి ఉండి జీవితకాల చెల్లుబాటుతో విండోస్10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రీ-లోడ్ చేయబడి వస్తుంది. ఇది రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

English summary
Amazon Giving The Best Discount Offers on Buying Mi Brand Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X