అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ లో బడ్జెట్ 5G ఫోన్‌లపై భారీ ఆఫర్లు...
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన యొక్క వెబ్ సైట్ లో నేటి నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన ఆన్‌లైన్ సేల్స్ ఆగస్టు 6 నుండి ఆగస్టు 10 వరకు నిర్వహిస్తుంది. ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నది.

ఈ సేల్ సమయంలో SBI కార్డ్ హోల్డర్లు ప్రతి కొనుగోలు మీద 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. నేటి సేల్స్ లో బడ్జెట్ ధరలో లభించే 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక దీని కన్నా మరొక గొప్ప సమయం ఇంకోటి ఉండదు అని చెప్పవచ్చు. నేటి సేల్స్ డిస్కౌంట్ ధరల వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
రియల్‌మి నార్జో 50 5G
రియల్‌మి సంస్థ ఇటీవల భారతదేశంలో విడుదల చేసిన 5G ఫోన్‌లలో ఒకటైన రియల్‌మి నార్జో 50 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.15,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 16,999 అయితే చివరిగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.17,999. నేటి అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమ్మకంలో రూ.2000 తగ్గింపు ధరతో పొందవచ్చు. రియల్‌మి నార్జో 50 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 మరియు రియల్‌మి UI 3.0తో రన్ అవుతుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో మరియు గరిష్టంగా 600 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది. హుడ్ కింద మాలి-G57 MC2 GPUతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoCతో రన్ అవుతూ 6GB LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ డ్యూయల్-LED ఫ్లాష్‌తో జత చేయబడింది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ M13 5G
శామ్సంగ్ సంస్థ ఇటీవల భారతదేశంలో గెలాక్సీ M13 5G ఫోన్ ను బడ్జెట్ ధరలో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12.0-ఆధారిత One UI 4తో రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో లభిస్తుంది. ఇది హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCతో రన్ అవుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. శామ్సంగ్ RAM ప్లస్ ఫీచర్‌తో RAMని 12GB వరకు పొడిగించుకోవచ్చు. ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M13 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, 5G (11 5G బ్యాండ్‌లు) మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది Samsung నాక్స్ సెక్యూరిటీ సూట్‌తో వస్తుంది.
రెడ్‌మి నోట్ 10 ప్రో
రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ లో రూ.15,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.
Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్
Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.
రెడ్‌మి 10 పవర్
రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద పవర్ బ్లాక్ మరియు స్పోర్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 13తో రన్ అవుతుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికల విషయంలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.
iQoo Neo 6
iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.29,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications