అమెజాన్ దీపావళి సేల్.. ధర రూ.10,999 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 6.72 FHD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
పండుగల సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. అమెజాన్ స్పెషల్ సేల్ 2024 లో భాగంగా రియల్‌మి నార్జో 70X 5G హ్యాండ్‌సెట్‌ను (Realme Narzo 70x 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. సేల్ డిస్కౌంట్, బ్యాంకు ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10,999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. దీపావళి సేల్‌లో (Amazon Great Indian Festival Diwali Special) భాగంగా అమెజాన్ రూ.1,500 వరకు కూపన్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ప్రస్తుతం ఈ ఆఫర్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.12,499 గా ఉంది. కూపన్ డిస్కౌంట్‌తో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు 3 -6 నెలలపాటు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్‌లో రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.72 FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రెయిన్ వాటర్ టచ్ ఫీచర్, ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ రియల్‌మి నార్జో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. మూడు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. వెనుకవైపు LED ఫ్లాష్‌ను కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. 1-50 శాతం ఛార్జింగ్‌ను 30 నిమిషాల్లో పూర్తిచేస్తుందని సంస్థ చెబుతోంది. కనెక్టివిటీపరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








