ధర రూ.17999 కే 50MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఫోన్.. అమెజాన్‌లో సేల్..!
దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ప్రత్యేక సేల్ 2024 లో (Amazon Great indian Festival Diwali Sale 2024) భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జె్ట్‌లను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ దీపావళీ సేల్ 2024 లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M55s Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్ సేల్‌లో భాగంగా 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.

ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ దీపావళీ సేల్ 2024 అక్టోబర్ 29న ముగుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ టెక్నాలజీను సపోర్టు చేస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS :
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ మరియు 256GB గరిష్ఠ స్టోరేజీతో అందుబాటులో ఉంది. దీంతోపాటు వర్చువల్ ర్యామ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఐదు 4 అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చు.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
శాంసంగ్ గెలాక్సీ M55s స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై 6, GPS వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ శాంసంగ్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications







