అమెజాన్‌లో ల్యాప్‌టాప్ల కొనుగోలుపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు చాలా ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో దీపావళి సేల్స్ ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి మొదలైన ఈ సేల్ ఈ నెల మొత్తం జరుగుతోంది. ఈ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ మొదలైన అనేక గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Amazon Great Indian Festival Extra Happiness Days Sale Today Block Buster Deals on Laptops

అమెజాన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 లో ల్యాప్‌టాప్ల కొనుగోలు మీద బిగ్ డిస్కౌంట్ అందించబడుతుంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు ప్రకటించబడ్డాయి. ఇంటి నుండి పని చేసే మరియు ఆన్‌లైన్ క్లాస్ కోసం ల్యాప్‌టాప్ ఉపయోగించే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ విక్రయ సమయంలో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ల్యాండ్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపును పొందవచ్చు. కాబట్టి మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రాయితీ ధరలలో కొనుగోలు చేయగల ల్యాప్‌టాప్‌ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Great Indian Festival Extra Happiness Days Sale Today Block Buster Deals on Laptops

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 (ఇంటెల్) (రూ.36,490)

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 220 నిట్స్ ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇందులో ఇంటెల్ కోర్ i3 10 వ తరం ప్రాసెసర్ ఫోర్స్ ఉంటుంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. 12GB RAM వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ల్యాప్‌టాప్ ఎనిమిది గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.

HP Chromebook x360 (రూ.38,990)

HP Chromebook x360 ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇది ఇంటెల్ కోర్ i3 10 వ తరం ప్రాసెసర్‌తో కన్వర్టబుల్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ ChromeOS మద్దతుతో పని చేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 13 గంటల బ్యాటరీ జీవితకాలం వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఆసుస్ వివోబుక్ 14 (రూ.47,990)

Asus VivoBook 14 ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 16: 9 యాస్పెక్ట్ రేషియో మరియు గరిష్టంగా 220 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇది ఇంటెల్ కోర్ ఐ 5 10 వ తరం ప్రాసెసర్ మరియు విండోస్ 10 హోమ్ ఫ్రీ లోడ్ కలిగి ఉంది. ఇది విండోస్ 11 కి ఉచిత అప్‌గ్రేడ్ పొందుతుంది. ఇది 8GB RAM మరియు 512GB ఇంటర్-స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

డెల్ 15 (రూ.41,990)

డెల్ బ్రాండ్ యొక్క డెల్ 15 ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఉంది. ఇది ఇంటెల్ కోర్ i3 11 వ తరం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్ కలిగి ఉంది. ల్యాప్‌టాప్ లిఫ్ట్-హింజ్ డిజైన్‌తో వస్తుంది.

HP 15 (రూ.38,990)

HP 15 ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 220 నిట్స్ ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇందులో AMD రైజెన్ 3 3250U ప్రాసెసర్ ఉంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్‌తో వస్తుంది, దీనిని 16GB వరకు విస్తరించవచ్చు. AMD రేడియన్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ USB టైప్-సి పోర్ట్ మరియు రెండు సూపర్‌స్పీడ్ యుఎస్‌బి టైప్-ఎ పోర్ట్‌లకు మద్దతు ఇస్తుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X