అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు!
ప్రపంచం మొత్తం మారుతున్నది. ఎంతలా మారుతున్నది అంటే ఇంతకు ముందు కిలోమీటర్ల దూరం వెళ్లి మనకు కావలసిన వస్తువులను ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఇంటిలోనే కూర్చొని మనకు కావలసిన అన్ని రకాల వస్తువులను స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి ఆర్డర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారు అధిక మంది డిస్కౌంట్స్ లభించే సీజన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అమెజాన్ ఇ-కామర్స్ సైట్ గొప్ప తగ్గింపులతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ పండుగ సేల్స్ యొక్క ప్రత్యేక రోజులలో అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తు అందరి దృష్టిని తన వైపుకు ఆకట్టుకుంటున్నది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను మరియు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్లు ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో లభిస్తున్నాయి.

అమెజాన్ అక్టోబర్ 3 న ప్రారంభించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ సేల్‌లో గాడ్జెట్ ప్రియుల కోసం ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లతో సహా ఇతర స్మార్ట్ పరికరాలకు అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందించబడుతున్నాయి. ఇటీవల 2021 లో విడుదలైన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ప్రముఖ మొబైల్‌లపై డిస్కౌంట్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తుంది. షియోమి, శామ్‌సంగ్, రియల్‌మీ, వన్‌ప్లస్, ఆపిల్‌తో సహా ఇతర కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు బొంబట్ డిస్కౌంట్ ధరలో ప్రదర్శించబడ్డాయి. ఎంపిక చేసిన బ్యాంకుల నుండి తక్షణ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో కొన్ని ఆకర్షణీయమైన డిస్కౌంట్ స్మార్ట్‌ఫోన్‌లను చూద్దాం.
Mi 11X Pro 5G Smartphone
Mi 11X Pro ఫోన్ 6.67-inch Full HD + డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు గరిష్టంగా 1,300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 888SoC ప్రాసెసర్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ రన్ చేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది మరియు ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ సోనీ IMX 582 సెన్సార్.
వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది మరియు డిస్‌ప్లే యొక్క 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్షన్ 1200 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ ఆక్సిజన్ 11.3 OS సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్‌తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యం కలిగి ఉంది.
రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్
రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G కి SoC ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 11 మద్దతుతో పనిచేస్తుంది. 6GB RAM + 64GB మరియు 6GB + 128GB కూడా అందుబాటులో ఉంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో 64 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. ఇందులో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 5,020mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Samsung Galaxy Note 20 Smartphone
Samsung Galaxy Note 20 Smartphone 6.7-inch Super AMOLED డిస్‌ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంది. డిస్‌ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ 60Hz. Exynos 990 SoC లో చిప్‌సెట్ సామర్థ్యం గల ప్రాసెసర్ ఉంది, దీనికి One UI 2.0 మద్దతు ఉన్న Android 10 OS మద్దతు ఉంది. ఇది మూడు వెనుక కెమెరా సెటప్‌లను కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో 64MP సెన్సార్ ఉంది. ఇది 4,500mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications