అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G పై రూ.3000 తగ్గింపు ఆఫర్స్..
శామ్‌సంగ్ బ్రాండ్ ఇటీవల ఇండియాలో విడుదల చేసిన కొత్త ఫోన్ Samsung Galaxy M52 5G అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలలో మొదటి సారి కొనుగోలు చేయడానికి వినియోగదారుల కోసం పరిచయ ధరలతో జాబితా చేయబడ్డాయి. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లతో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 120Hz సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G ఫోన్ ధరలు & లభ్యత వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో ఈ ఫోన్ రూ.3,000 తక్కువ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అమెజాన్ సేల్ లో పరిచయ ఆఫర్ వద్ద 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.26,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.28,999 ధరల వద్ద ఈ ఫోన్‌ను అందిస్తోంది. అక్టోబర్ 2 న ప్రైమ్ మెంబర్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సాధారణ వినియోగదారులందరికీ ఈ ఫోన్ మీద అన్ని రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్ఫోన్ Samsung.com లో మరియు ఎంచుకున్న రిటైల్ స్టోర్‌లు కూడా అందుబాటులో ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G అసలు ప్రారంభ ధర 6GB RAM + 128GB నిల్వ కోసం రూ.29,999 మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కి రూ.31,999. ఇది బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G HDFC బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వారికి అధికంగా ప్రయోజనం ఉంటుంది. HDFC బ్యాంక్ యూజర్లకు 10% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఒకే సారి మొత్తం డబ్బును చెల్లించలేని వారికి అనుకూలంగా EMI పద్దతిలో పొందడానికి కూడా అవకాశం ఇస్తుంది. HDFC బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌లు
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై OneUI 3.1 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేను కలిగి ఉండి హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ని శక్తిని కలిగి ఉండి 8GB RAM మరియు 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఒక 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంటుంది. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS/ A-GPS, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








