అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అధికంగా డిస్కౌంట్ ఆఫర్స్

|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్స్ అక్టోబర్ 3 నుండి మొదలుకానున్నాయి. ఈ అమెజాన్ అమ్మకం సమయంలో వివిధ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు మరియు కెమెరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీమొత్తంలో డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ-కామర్స్ దిగ్గజం టీవీలు మరియు గృహోపకరణాలపై కూడా కొన్ని ఒప్పందాలను ప్రకటించింది. అదనంగా ఎకో, ఫైర్ టివి మరియు కిండ్ల్ వంటి అమెజాన్ ఉత్పత్తులు సంవత్సరంలో అత్యల్ప ధరలలో లభిస్తాయని తెలిపింది. నెల రోజులపాటు జరిగే ఈ పండుగ సేల్ లో కస్టమర్లకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆఫర్లతో Apple, HP, Lenovo, OnePlus, Samsung, Sony మరియు Xiaomi వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Great Indian Festival Sale Revealed Smartphones and Electronics Deals

అమెజాన్‌లోని ల్యాండింగ్ పేజీ ప్రకారం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఆపిల్, శామ్‌సంగ్, వివో, వన్‌ప్లస్, రెడ్‌మి, వివో, టెక్నో వంటి మరిన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. వివో V21e 5G ని రూ.24,990 కి, వివో Y73 ని రూ.20,990 మరియు వివో X60 ప్రో రూ.49,990 బహుళ ఎంపికలతో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 ను రూ.44,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC తో రన్ అయ్యే శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G ని ఈ విక్రయ సమయంలో రూ.69,999 ధర వద్ద పొందవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ సందర్భంగా అదనంగా శామ్‌సంగ్ గెలాక్సీ S20FE 5G కొనుగోలు మీద అమెజాన్ "బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది ఇయర్" ప్రకటించింది. ఈ ప్రత్యేక వెబ్‌పేజీ ప్రకారం అమెజాన్ నోటిఫై మి బటన్‌ని చేర్చింది మరియు పేజీలో ఇవ్వబడిన క్లూస్‌ని ఉపయోగించి పాల్గొనేవారు అతిపెద్ద డీల్ ఏమిటో ఊహించి స్మార్ట్‌ఫోన్‌ని గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

టెక్నో స్పార్క్ 7T యొక్క ప్రస్తుత ధర రూ.9,499 ఉంటే అమ్మకం సమయంలో రూ.8,499 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా టెక్నో స్పార్క్ 8, టెక్నో పాప్ 5P మరియు టెక్నో పోవా 2

వంటి ఇతర టెక్నో స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అమెజాన్ డీల్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. అదే సమయంలో Redmi 9A ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ సమయంలో రూ.6,799 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

అమెజాన్ పేర్కొన్న ల్యాండింగ్ పేజీ ప్రకారం అక్టోబర్ 1 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిరోజూ మెగా డీల్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. Xiaomi 11 Lite NE 5G లాంచ్ చేయబడుతుంది. మరియు Samsung M సిరీస్ మరియు ఒప్పో హ్యాండ్‌సెట్‌లపై డీల్స్ నేడు వెల్లడి చేయబడతాయి. ఇంకా సెప్టెంబర్ 30న iQOO ఫోన్‌లలో మెగా డీల్ వెల్లడించబడుతుంది.

అక్టోబర్ 1 న ఒప్పో A- సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అమెజాన్ Xiaomi ఫోన్‌లలో మెగా డీల్‌ని వెల్లడిస్తుంది అలాగే Samsung Galaxy S20 FE 5G యొక్క డీల్ ధరను ప్రకటించింది. OnePlus మరియు Apple హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన సమాచారం కూడా త్వరలో ప్రకటించబడుతుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 అమ్మకంలో ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్లపై 80 శాతం వరకు, స్మార్ట్ వాచ్‌లపై 60 శాతం వరకు, టాబ్లెట్‌లపై 45 శాతం మరియు కెమెరాలో 60 వరకు తగ్గింపు ఉంటుంది అని ఇ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. అమెజాన్ కూడా టీవీలు మరియు వాటి ఉపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం స్మార్ట్ స్పీకర్లు మరియు డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్స్ మరియు కిండ్ల్ వంటి అమెజాన్ ఉత్పత్తులపై డీల్స్ మరియు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale Revealed Smartphones and Electronics Deals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X