Home
Deal of the day

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ లో రూ.5000 తగ్గింపు ఆఫర్లతో లభించే ఫోన్‌లు...

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 2022 సంవత్సరంలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో మొదటి సేల్ ని జనవరి 17 నుంచి అందరి కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సిస్ మొదలయింది. అమెజాన్ వెబ్ సైట్ లో ఈ సేల్ కి సంబంధించి ప్రత్యేక పేజీ ప్రకారం SBI కార్డులను కలిగిన వారికి అదనంగా 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అమ్మకంలో అనేక ఫోన్‌ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బడ్జెట్ ధరలో మరియు మిడ్-రేంజ్ ధరలో లభించే ఫోన్ల కొనుగోలు మీద వినియోగదారులకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Great Republic Day 2022 Sale Offers Up to Rs.5000 Extra Off on These Smartphones

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.58,999

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

షియోమి Mi 11X 5G ధర రూ.22,999

షియోమి Mi 11X 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ 6GB/ 8GB ర్యామ్ ఎంపికలతో పాటుగా 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రియల్‌మి నార్జో 50A ధర రూ.12,499

రియల్‌మి నార్జో 50A ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.12,499 ధర వద్ద ఆక్సిజన్ బ్లూ మరియు ఆక్సిజన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది రియల్‌మి UI 2.0 మరియు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రన్ అవుతాయి. ఇది 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 88.7 శాతం స్క్రీన్-టు- బాడీ నిష్పత్తితో కలిగి ఉండి ARM మాలి- G52 GPU మరియు 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉండి మీడియాటెక్ హీలియో G85 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

రియల్‌మి నార్జో 50i ధర రూ.8,499

రియల్‌మే నార్జో 50i ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ రూ.8,499 ధర వద్ద మింట్ గ్రీన్ కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇది 6.5-అంగుళాల డిస్‌ప్లేను 89.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది మరియు ఇది యునిసోక్ 9863 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM వరకు ప్యాక్ చేస్తుంది మరియు 64GB వరకు అంతర్నిర్మిత నిల్వను అందిస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ (256GB వరకు) ఉపయోగించి నిల్వను విస్తరించవచ్చు. ఆప్టిక్స్‌లో f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ AI వెనుక కెమెరా మరియు f/2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియల్‌మే నార్జో 50 ఐ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

రియల్‌మి 8

రియల్‌మి 8 ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.13,999 ధర వద్ద మరియు 6GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.15,999 ధర వద్ద స్పేస్ బ్లాక్ మరియు స్పేస్ పర్పుల్ కలర్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్‌మీ యుఐ 2.0 పై రన్ అవుతూ 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్‌ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ శామ్‌సంగ్ S5KJN1 సెన్సార్ f/1.8 ఫైవ్-పీస్ లెన్స్‌తో పాటు, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి డీప్ లెన్స్‌తో కలిగి ఉంటుంది.

English summary
Amazon Great Republic Day 2022 Sale Offers Up to Rs.5000 Extra Off on These Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X