Home
Deal of the day

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ మొదలయ్యాయి!! డిస్కౌంట్ ఆఫర్లపై లుక్ వేయండి...

2022 నూతన సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు నిన్నటితో ముగిసాయి. కానీ కొన్ని చోట్ల ఇంకా పండుగ సంబరాలు కొనసాతూనేఉన్నాయి. కొత్త సంవత్సరం మొదటి నెలలో ఏదైనా మంచి ప్రీమియం స్మార్ట్‌వస్తువులను ముఖ్యంగా ఇటీవల లాంచ్ అయిన వాటిని కొనుగోలు చేయాలనీ భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం తన యొక్క సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో కొత్త సేల్స్ ని నిర్వహిస్తోంది. ప్రైమ్ యూజర్లకు నిన్నటి నుంచి సేల్స్ అందుబాటులోకి రాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సేల్స్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లతో పాటుగా మునుపటి ఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ విక్రయ సమయంలో అమెజాన్ SBI బ్యాంక్ మరియు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Great Republic Day 2022 Sale Started For Ever One: Here are Discounts Offers Details

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.54,999

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్ షూటర్ తో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడం మరియు వీడియో చాట్‌లను ఎనేబుల్ చేయడం కోసం ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 11T 5G ధర రూ.16,999

రెడ్‌మి నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 12 రూ.56,999

ఆపిల్ ఐఫోన్ 12 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 20 శాతం స్క్రీన్ స్పేస్ తో 6.1-అంగుళాల డిస్ప్లేని మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. అలాగే ప్రతిస్పందించే మరియు పవర్-ఎఫెక్టివ్ సిస్టమ్ కోసం స్వైప్ స్పీడ్ వంటి యూజర్ ఇన్‌పుట్ ఆధారంగా వాటి రిఫ్రెష్ రేట్లను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు. ఇది డాల్బీ విజన్ HDR10 మరియు HLG కి కూడా మద్దతు ఇస్తారు. ఇవి కస్టమ్ ఫినిష్‌తో తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది తక్కువ వెలుతురులో ప్రకాశవంతమైన ఫలితాల కోసం 47 శాతం ఎక్కువ కాంతిని సంగ్రహిస్తుంది. నైట్ మోడ్ వేగంగా పనిచేస్తుంది మరియు పదునైన షాట్‌లను సంగ్రహిస్తుంది. ఇందుకోసం 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను f/2.4 ఎపర్చరుతో కలిగి ఉంది. కొత్త సినిమాటిక్ వీడియో మోడ్ ర్యాక్ ఫోకస్‌కి మద్దతు ఇస్తుంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధర రూ.19,999

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.19,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

Xiaomi 11 Lite NE 5G రూ.26,999

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

English summary
Amazon Great Republic Day 2022 Sale Started For Ever One: Here are Discounts Offers Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X