అమెజాన్ సేల్.. 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్!
భారత్ మార్కెట్‌లో ఇటీవల రియల్‌మి 16 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఫోన్‌లు 200MP కెమెరాలను కలిగి ఉన్నాయి. గత నెలలో విడుదల అయిన రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ ను (Realme Narzo 90x 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.
అమెజాన్ సేల్ :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రియల్‌మి వెబ్‌సైట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13998, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో (Amazon Great Republic Day Sale 2026) భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.1250 కూపన్ కోడ్ డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై రూ.1250 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌లను రూ.12,748, రూ.14,248 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో మరింత తగ్గింపు ధరకు ఈ హ్యాండ్‌సెట్ ను కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్ ను కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
సోనీ కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌కు ఈ కెమెరాలు సపోర్టు చేస్తాయి. 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రెండు కలర్ వేరియంట్స్ :
ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఫ్లాష్ బ్లూ, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








