రూ.7799 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లేటెస్ట్ శాంసంగ్ 5G ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల కాలంలో భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్, మిడ్ రేండ్, ఫ్లాగ్ షిప్ మోడల్స్‌ను విడుదల చేసింది. అయితే విడుదల అయిన కొన్ని రోజులకే ఈ ఫోన్‌లు భారీ డిస్కౌంట్ ధరలతో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల విడుదల అయిన మిడ్ రేంజ్ A సిరీస్ ఫోన్‌ల ధరలను కూడా డిస్కౌంట్ ధరలకు ఉన్నాయి.
ఈ సంవత్సరం మార్చి నెలలో ఎంట్రీ లెవల్ ధరలో M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 లో (Amazon Great Summer Sale 2025) భాగంగా శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M06 5G Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.200 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.7799 కే సొంతం చేసుకోవచ్చు.
అయితే విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉండగా ప్రస్తుతం రూ.8499 కే కొనుగోలు చేయవచ్చు. మరియు విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉండగా ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.9799 కే సొంతం చేసుకోవచ్చు. కూపన్ కోడ్ ద్వారా రూ.200 తగ్గింపును పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీప్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో అందుబాటులో ఉంది.
గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 S0C చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్, క్విక్ షేర్ వంటి ఫీచర్‌లున్నాయి. 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.3, WiFi, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







