Home
Deal of the day

అమెజాన్‌ సేల్‌.. 50MP + 50MP కెమెరాలు, 32MP + 32MP సెల్ఫీ కెమెరాలు కలిగిన ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..!

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఇయర్‌బడ్స్‌ తోపాటు అనేక గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. ఈ సేల్‌ మే 1 నుంచి ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా షియోమీ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. గత సంవత్సరం షియోమీ ఈ షియోమీ 14 సివీ (Xiaomi 14 CIVI Smartphone) ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.42,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.50,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon Great Summer Sale 2025) భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14 Civi smartphone

అమెజాన్‌లో షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ వేరియంట్‌ రూ.31999 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది. విడుదల ధరలో పోలిస్తే ఏకంగా బేస్‌ వేరియంట్‌ పై రూ.11 వేలు, టాప్‌ వేరియంట్‌ పై రూ.17 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు HDFC బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.1250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్రూయిజ్‌ బ్లూ, Matcha Green, షాడో బ్లాక్‌ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో భారత్‌ మార్కెట్‌తో అందుబాటులో ఉంది. షియోమీ ఫ్లాష్‌షిప్‌ ఫోన్‌ల కోసం చూసే వారు ఈ ఆఫర్‌ను మిస్‌ చేసుకోవద్దు.

షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 446ppi పిక్సెల్‌ డెన్సిటీ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ గొరిల్లా గ్లాస్ 2 రక్షణను పొందుతుంది.

ఈ షియోమీ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఐస్‌లూప్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

రెండు 32MP సెల్ఫీ కెమెరాలు : కెమెరా విభాగం పరంగా Leica ఆధారిత ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పొర్ట్రెయిట్‌ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP + 32MP కెమెరాలను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీ తో అందుబాటులో ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 5G, 4G VoLTE, బ్లూటూత్‌ 5.4, WiFi 6, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great summer sale 2025 offers best ever deal on Xiaomi 14 Civi smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X