Home
Deal of the day

అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్స్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క వెబ్ సైట్ లో మొబైల్ సేవింగ్స్ డేస్స్ పేరుతో కొత్తగా సేల్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించి జులై 29th వరకు నిర్వహించనున్నది. ఈ నాలుగు రోజుల అమ్మకం సమయంలో అధిక ధరతో పాటుగా మెరుగైన ఫీచర్లను కలిగిఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అమెజాన్ ఇప్పుడు అందించే సేల్స్ మరింత ప్రియమైనదిగా మారింది.

Amazon Mobile Savings Days Sale Offers Up to 40% OFF on Top Selling Smartphones

స్మార్ట్‌ఫోన్‌లను అధికంగా వినియోగించే వారు మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను పొందాలని చూస్తూ ఉంటారు. ఇటువంటి స్మార్ట్‌ఫోన్‌లను పొందాలని చూస్తున్న వారు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అమెజాన్ యొక్క మొబైల్ సేవింగ్స్ డేస్స్ సేల్స్ లో బ్యాంక్ అఫ్ బరోడా మరియు సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మి C30

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ లో ఇప్పుడు రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,499 ధర వద్ద మరియు 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.8,299 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో మరియు 16.7 మిలియన్ కలర్స్‌తో వస్తుంది. ఇది వర్టికల్ స్ట్రిప్ డిజైన్‌ను కలిగి ఉండి 8.5mm మందంతో మరియు 182 గ్రాముల బరువుతో బ్యాంబూ గ్రీన్ మరియు లేక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా ఆధారితమై 32GB UFS 2.2 ఇంటర్నల్‌ స్టోరేజ్ స్పేస్‌తో జత చేయబడి వస్తుంది. ఇది 2GB మరియు 3GB RAM వేరియంట్లలో లభిస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన రియల్‌మి గో ఎడిషన్ UIతో రన్ అవుతుంది.

iQoo Neo 6

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.29,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 10R‌ 5G

వన్‌ప్లస్ 10R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10T

రెడ్‌మి నోట్ 10T స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.13,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

రెడ్‌మి 10 పవర్

రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద పవర్ బ్లాక్ మరియు స్పోర్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 13తో రన్ అవుతుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికల విషయంలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

English summary
Amazon Mobile Savings Days Sale Offers Up to 40% OFF on Top Selling Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X