108MP కెమెరా, 6600mAh బ్యాటరీ, డ్రాప్ రెసిస్టెంట్ ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు!
హానర్ నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లోకి హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ (Honor X9c 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 108MP కెమెరాతోపాటు 6600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే డిస్కౌంట్‌ను పొందవచ్చు.
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon Sale) అందుబాటులో ఉంది. ఇటీవలే ఈ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. అయితే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 కు అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్‌లో ప్రస్తుతం రూ.20748 కే అందుబాటులో ఉంది.

మూడు కలర్ వేరియంట్స్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ టైటానియం బ్లాక్, జడే సియాన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు ఎన్ని రోజులపాటు అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు.
108MP కెమెరా :
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 5MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ ప్రైమరీ కెమెరా 3x జూమ్‌తోపాటు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది.
డ్రాప్ రెసిస్టెన్స్ :
ఈ ఫోన్ మెరుగైన కెమెరా ఫీచర్లతోపాటు భారీ డిస్‌ప్లే, మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు -30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఫోన్ డ్యామేజీ ఉంటుందని హానర్ చెబుతోంది. 7.98 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.
భారీ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఫ్లిక్కర్ ఫ్రీ, Low Blue లైట్ TUV Rheninland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ను కలిగి ఉంది. Adreno 719 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. IP65M డస్ట్ మరియు 360 డిగ్రీ వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.1, వైఫై, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంది. AI Motion Sensing, AI Erase, AI Deepfake Detection, AI Magix Capsule, AI Magic Portal 2.0 వంటి అనేక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications