Home
Deal of the day

Amazonలో ఈ బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలో అధిక మంది వినియోగదారులు షాపింగ్ చేయడానికి ఇష్టపడడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తూనే ఉంది. ప్రస్తుత పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొన్ని అద్భుతమైన ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో పరిస్థితుల దృష్ట్యా కస్టమర్‌లు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. రంజాన్ 2022 సందర్భంగా అమెజాన్ తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది.

Amazon Offers Best Discounts on Buying Best Picture Quality Camera Smartphones

స్మార్ట్‌ఫోన్లలో మంచి కెమెరా ఫీచర్స్ కలిగిన వాటిని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్న వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ ను అందిస్తున్నది. ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Oneplus nord 2 5G ధర రూ. 29,999

OnePlus Nord 2 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 మరియు 6GB RAM + 128 GB స్టోరేజ్‌ వేరియంట్ రూ. 27,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్‌హెచ్‌డి+తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 65W వార్ప్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మోనో కెమెరా వంటివి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 10 ప్రో ధర రూ.16,999

రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M33 5g ధర రూ.17,499

శామ్‌సంగ్ గెలాక్సీ M33 5g స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.17,999 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఒప్పో A74 ధర రూ.13,999

ఒప్పో A74 అమెజాన్ లో ఇప్పుడు 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్OS 11.1 Liteతో ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 1,600x720 పిక్సెల్‌లు మరియు 269 పిక్సెల్‌ల పిక్సెల్ సాంద్రత (ppi)ని కలిగి ఉంది. Oppo ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో "ఐ-కేర్" స్క్రీన్ ఉంది. ఒప్పోA16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X RAM మరియు 32GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను 256GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 + 2 + 2-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది.

English summary
Amazon Offers Best Discounts on Buying Best Picture Quality Camera Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X