అమెజాన్ సేల్.. ధర రూ.1,599 కే 38 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన OnePlus ఇయర్‌బడ్స్..!!
భారత్ మార్కెట్‌లో దీపావళి సమయంలో అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై సంస్థలు డిస్కౌంట్‌లను అందించాయి. అనంతరం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహించాయి. ఈ సమయంలోనూ స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ వంటి అనేక గ్యాడ్జెట్‌లపై డిస్కౌంట్‌లను అందించాయి. ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే భారీగా ధర తగ్గింది. ఈ బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r (OnePlus Nord Buds 2r Amazon offer) ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. విడుదల సమయంలో ధర రూ.2,199 గా ఉండేది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో రూ.1,599 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్ (OnePlus Nord Buds 2r) సెమీ ఇన్-ఇయర్ డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి. అవుటర్ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటున్నాయి. 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి.
ఈ బడ్స్ మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ మైక్‌లను అమర్చారు. దీంతోపాటు స్పష్టమైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టు చేస్తున్నాయి. ఈ వన్‌ప్లస్ బడ్స్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ను సపోర్టు చేస్తున్నాయి. మరియు బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తున్నాయి. IP55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.
ఈ బడ్స్ బోల్డ్, బాస్ మరియు బ్యాలెన్స్‌డ్ వంటి యూనిక్ ఈక్వలైజర్ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, స్మార్ట్‌టీవీ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లతో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. కాలింగ్, గేమింగ్, అవుట్‌డోర్, రికార్డింగ్, రన్నింగ్, ట్రావెలింగ్ వంటి సమయాల్లో ఉపయోగించుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్‌ను పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 38 గంటలపాటు వినియోగించుకోవచ్చు. డీప్ గ్రే, ట్రిపుల్ బ్లూ. మిస్టీ గ్రే రంగుల్లో ఈ బడ్స్ లభించనున్నాయి. ఈ బడ్స్ Hey Melody యాప్‌ను సపోర్టు చేస్తాయి. 94ms లో లేటెన్సీని కలిగి ఉంటాయి. దీంతోపాటు వన్‌ప్లస్ ఫాస్ట్ పెయిరింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి.
దీంతోపాటు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 కూడా ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్ 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ANC ఫీచర్‌ను సపోర్టు చేస్తున్నాయి. ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. 4- మైక్ డిజైన్ సహా డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పష్టమైన ఆడియోను అందిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2 ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 36 గంటలపాటు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బడ్స్ ధర అమెజాన్‌లో రూ.2699 గా ఉంది.


Click it and Unblock the Notifications








