ధర రూ.12,999 కే 11 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో ట్యాబ్లెట్.. అమెజాన్‌లో సేల్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ లు, గ్యాడ్జెట్ లు, ట్యాబ్లెట్ ల తయారీ సంస్థ షియోమీ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ లో రెడ్‌మి ప్యాడ్ SE ట్యాబ్లెట్ ను (Redmi Pad SE Tablet Sale) విడుదల అయింది. ఈ ప్యాడ్ మూడు స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. 11 అంగుళాల డిస్‌ప్లేతోపాటు 8000mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్ లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ ను అమెజాన్ లో (Amazon) డిస్కౌంట్ ను ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల పూర్తి వివరాలు.
రెడ్‌మి ప్యాడ్ SE ధర, సేల్ వివరాలు :
ప్రస్తుతం రెడ్‌మి ప్యాడ్ SE ట్యాబ్లెట్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ రెడ్‌మి ప్యాడ్ ప్రారంభ ధర రూ.12999 గా ఉంది.

అదే 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.1500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. గ్రాఫైట్ గ్రే, లావెండర్ పర్పుల్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ రెడ్‌మి ప్యాడ్ SE ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
రెడ్‌మి ప్యాడ్ SE స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
రెడ్‌మి ప్యాడ్ SE ట్యాబ్లెట్ 11 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1920*1200 పిక్సల్స్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కంటి రక్షణ కోసం TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ :
ఈ ట్యాబ్లెట్ 6nm ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. Adreno 610 చిప్‌సెట్ సహా 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మూడు స్టోరేజీ వేరియంట్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
8000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి ప్యాడ్ వెనుకవైపు (Redmi Pad SE Tablet Specifications) 8MP కెమెరా మరియు ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది. Wi-Fi వేరియంట్ గా అందుబాటులో ఉంది.
ట్యాబ్లెట్ బరువు :
కనెక్టివిటీ పరంగా రెడ్‌మి ప్యాడ్ SE ట్యాబ్లెట్ Wi-Fi 802, బ్లూటూత్ 5.0, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌ను అమర్చి ఉంది. ఈ ట్యాబ్లెట్ బరువు 478 గ్రాములుగా ఉంది. స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








