Amazonలో ఈ స్మార్ట్‌ఫోన్లపై ఎన్నడూలేని అధిక డిస్కౌంట్ ఆఫర్లు!! మిస్ అవ్వకండి

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ కోసం బాగా ప్రసిద్ధి చెందింది. ఆన్‌లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎల్లవేళలా తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారు ముఖ్యంగా ఇటీవల కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ల తమ యొక్క చేతులలో పొందాలనుకునే వారికి నేటి డీల్ అఫ్ ది డే విభాగంలో గొప్ప ఆఫర్లను అందిస్తోంది. అంతేకాకుండా ఐసీఐసీఐ మరియు కోటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Offers Huge Discounts on Selected Brand Smartphones

వన్‌ప్లస్ నార్డ్ CE 5G ధర రూ.23,999

వన్‌ప్లస్ నార్డ్ CE 5G అమెజాన్ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.22,999 ధర వద్ద 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.24,999 ధర వద్ద బ్లూ వాయిడ్ (మాట్టే), చార్‌కోల్ ఇంక్ మరియు సిల్వర్ రే వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు ఆక్సిజన్‌ OS11 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G Socతో పాటు అడ్రినో 619 GPU మరియు 6GB ర్యామ్ లతో జతచేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 5G ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఇఐఎస్) తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , ఎఫ్ / 2.25 అల్ట్రా- వైడ్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు f / 2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది f / 2.45 లెన్స్ మరియు EIS మద్దతుతో వస్తుంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.13,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.12,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది బండిల్డ్ 22.5W ఛార్జర్ మరియు 9W రివర్స్ ఛార్జింగ్ ఉపయోగించి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ధర రూ.14,999; 16,999

శామ్‌సంగ్ గెలాక్సీ M32 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ.14,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద బ్లాక్, వైట్ మరియు బ్లూ వంటి మూడు కలర్ ఎంపికలలో వస్తుంది.ఇది 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఇన్ఫినిటీ-యు అమోలెడ్ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో లోడ్ చేయబడింది. ఈ స్క్రీన్ 90 నిట్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 800 నిట్ బ్రైట్‌నెస్ లను కలిగి ఉండడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 6GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64MP సెన్సార్‌తో వస్తుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20MP లెన్స్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 50A ధర రూ.12,499

రియల్‌మి నార్జో 50A ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.12,499 ధర వద్ద ఆక్సిజన్ బ్లూ మరియు ఆక్సిజన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది రియల్‌మి UI 2.0 మరియు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రన్ అవుతాయి. ఇది 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 88.7 శాతం స్క్రీన్-టు- బాడీ నిష్పత్తితో కలిగి ఉండి ARM మాలి- G52 GPU మరియు 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉండి మీడియాటెక్ హీలియో G85 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని అంకితమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్లాక్ మరియు వైట్ పోర్ట్రెయిట్ లెన్స్ f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు కలిగి ఉన్నాయి.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X