Home
Deal of the day

Amazonలో రూ.30,000 ధరలోపు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ముఖ్యంగా రూ.30000 లోపు ధర వద్ద గల ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు రూ.1,500 వరకు తక్షణ క్యాష్ బ్యాక్ ప్రయోజనం కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Offers More Discount Offers Under Rs.30,000 Smartphones to Buy in December 2021

Oneplus nord 2 ధర రూ. 29,999

OnePlus Nord 2 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 మరియు 6GB RAM + 128 GB స్టోరేజ్‌ వేరియంట్ రూ. 27,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్‌హెచ్‌డి+తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 65W వార్ప్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మోనో కెమెరా.

Xiaomi 11 Lite NE 5G

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఇప్పుడు రూ.26,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.28,999 ధర వద్ద అమెజాన్ లో లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధర రూ.29,999; 31,999

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.29,999; 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.31,999 ధర వద్ద బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ కలర్ వేరియంట్లలో ఇప్పుడు అమెజాన్ లో లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై వన్ UI 3.1 తో రన్ అవుతూ 6.7-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వివో X60 ధర రూ.34,990

వివో X60 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,990 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.39,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,376 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 3.1 విస్తరించలేని స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, బ్లూటూత్ v5.1 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో రెనో 5 ప్రో 5G ధర రూ.35,990

ఒప్పో రెనో 5 ప్రో 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో రూ.35,990 ధర వద్ద ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి + OLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ సాంద్రత, 20: 9 కారక నిష్పత్తి, 92.1 శాతం స్క్రీన్ నిష్పత్తితో 402PP వద్ద 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoCను కలిగి ఉండి 8GB మరియు 12GB LPDDR4x RAM ఎంపికలతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 1.7 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కెమెరాను కలిగి ఉంటాయి.

English summary
Amazon Offers More Discount Offers Under Rs.30,000 Smartphones to Buy in December 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X