Amazon ఒప్పో అడ్వాన్స్ డేస్ సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...
2022 నూతన సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ కోసం అధిక మొత్తంలో ఖర్చుచేయకుండా సరికొత్త ఫీచర్స్ కలిగిన ఏదైనా మీడియం రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం తన యొక్క సైట్ లో నిర్వహిస్తున్న ఒప్పో అడ్వాన్స్ డేస్ సేల్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ ఈ విక్రయ సమయంలో బ్యాంక్ అఫ్ బరోడా యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో A54 ధర రూ.13,999
ఒప్పో A54 అమెజాన్ లో రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 4GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్OS 11.1 Liteతో ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 1,600x720 పిక్సెల్‌లు మరియు 269 పిక్సెల్‌ల పిక్సెల్ సాంద్రత (ppi)ని కలిగి ఉంది. Oppo ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో "ఐ-కేర్" స్క్రీన్ ఉంది. ఒప్పోA16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X RAM మరియు 32GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను 256GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 13 + 2 + 2-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో A16K రూ.10,490
ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ 3GB RAM మరియు 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లో ఇప్పుడు అమెజాన్ లో రూ.10,490 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్OS 11.1 Liteతో ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను 1,600x720 పిక్సెల్‌లు మరియు 269 పిక్సెల్‌ల పిక్సెల్ సాంద్రత (ppi)ని కలిగి ఉంది. Oppo ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో "ఐ-కేర్" స్క్రీన్ ఉంది. ఒప్పోA16K స్మార్ట్ ఫోన్ 3GB LPDDR4X RAM మరియు 32GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను 256GB వరకు విస్తరించవచ్చు. కెమెరా సెటప్ విభాగానికి వస్తే 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో F19 ధర రూ.19,990
ఒప్పో F19 ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.19,990 ధర వద్ద లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 పై కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతూ 6.43-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది 6GB RAM తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ని కలిగి ఉంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Oppo F19 లో కంపెనీ 128GB అంతర్గత నిల్వను అందించింది. ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో సహా సాధారణ కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
ఒప్పో A15s ధర రూ.12,490
ఒప్పో A15s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,490 ధర వద్ద ఇప్పుడు అమెజాన్ లో డైనమిక్ బ్లాక్ మరియు ఫ్యాన్సీ వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో ఆఫర్‌ల భాగంగా లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.52-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
OPPO A16 ధర రూ.13,990
OPPO A16 ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ రూ.13,990 ధర వద్ద క్రిస్టల్ బ్లాక్ మరియు పెర్ల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 జీబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి, మీడియాటెక్ హీలియో జి 35 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉన్న V- ఆకారపు గీత లభిస్తుంది. ఈ OPPO ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది, ఇది పవర్ బటన్ వలె రెట్టింపు అవుతుంది. OPPO A16 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది, ఇందులో 13MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది మరియు మాక్రో మరియు మోనోక్రోమ్ షాట్‌ల కోసం రెండు 2MP కెమెరాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విభాగంలో, OPPO A16 ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్‌ఓఎస్ 11.1 పై నడుస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి .Oppo A16 ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఇది స్ప్లాష్ నిరోధకత కోసం IPX4 సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications