Home
Deal of the day

అమెజాన్‌లో బ్రాండెడ్ ఎయిర్ కూలర్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. వీటితో వేసవి తాపానికి చెక్.. త్వరపడండి!

Air Cooler: మండే ఎండలు మొదలయ్యాయి. వేడిగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి గాలి కోసం అందరూ అల్లాడిపోతున్నారు. కూలర్ లేని ఇళ్లల్లో ఇప్పుడే కొనేద్దామా అని ఆలోచిస్తున్నారు. మీరూ వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి మంచి ఎయిర్ కూలర్ కొనాలని చూస్తున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్. అమెజాన్‌లో బెస్ట్ బ్రాండ్లు అయిన బజాజ్, సింఫనీ, క్రాంప్టన్ ఎయిర్ కూలర్లపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ కూలర్లు లేటెస్ట్ ఫీచర్లతో, పెద్ద వాటర్ ట్యాంక్‌లతో, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈజీ EMI ఆప్షన్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఉండటంతో వీటిని కొనడం ఇప్పుడు మరింత సులువు. అమెజాన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఎయిర్ కూలర్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

Amazon Sale Grab the Best Air Cooler Deals with Huge Discounts and Offers

* సింఫనీ డెసర్ట్ కూలర్

సింఫనీ డెసర్ట్ కూలర్ 70 లీటర్ల వాటర్ ట్యాంక్‌తో, సేఫ్టీ గ్రిల్‌తో వస్తుంది, అలాగే 16-అంగుళాల ఫ్యాన్ ఉంటుంది, ఇది చాలా బాగా గాలిని ఇస్తుంది. గాలి గదంతా వీచేలా ఆటోమేటిక్ వెర్టికల్ స్వింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కూలర్‌లో శక్తివంతమైన పంప్, సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా డయల్-నాబ్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి.

దీనిపై 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది. దీని ధర రూ.9,491, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పే చేస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. EMI నెలకి రూ.460 నుంచి మొదలవుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లేదా అమెజాన్ యాప్‌కు వెళ్లి దీన్ని చెక్ చేయొచ్చు. రివ్యూలు చదివి కొనాలా వద్దా అని మీరే నిర్ణయించుకోవచ్చు.

* బజాజ్ డెసర్ట్ ఎయిర్ కూలర్

ఈ బజాజ్ ఎయిర్ కూలర్ మీ ఇంటికి మంచి ఛాయిస్. ఇందులో మూడు స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి, మీకు కావాల్సినంత గాలి వచ్చేలా స్పీడ్ మార్చుకోవచ్చు. హెక్సాకూల్ టెక్నాలజీతో తక్కువ నీటితోనే ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. దీనిలో ఐస్ చాంబర్ కూడా ఉంది, కావాలంటే ఐస్ వేసుకోవచ్చు.

ఈ కూలర్ యాంటీ-బ్యాక్టీరియల్ ప్యాడ్స్‌తో వస్తుంది, గాలిని శుభ్రంగా, సూక్ష్మజీవులు లేకుండా ఉంచుతుంది. దీని అసలు ధర రూ.9,289, EMI ఆప్షన్ రూ.450 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, ఈ మోడల్‌పై మీరు గరిష్టంగా రూ.1,500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అమెజాన్ వెబ్‌సైట్ లేదా యాప్‌కు వెళ్లి దీన్ని చెక్ చేయొచ్చు.

* క్రాంప్టన్ ఓజోన్ డెసర్ట్ ఎయిర్ కూలర్

ఈ క్రాంప్టన్ కూలర్ 75 లీటర్ల కెపాసిటీతో వస్తుంది, దీని హై-స్పీడ్ ఫ్యాన్ గాలిని 52 అడుగుల దూరం వరకు విసురుతుంది. ఇది ఇన్వర్టర్‌పై కూడా పనిచేస్తుంది, కరెంట్ పోయినా కూల్‌గా ఉండొచ్చు. ఈ కూలర్‌లో ఆటో స్వింగ్, నాలుగు వైపులా గాలి వచ్చేలా ఫోర్-వే ఎయిర్ డిఫ్లెక్షన్ ఫీచర్లు ఉన్నాయి.

దీని బాడీ తుప్పు పట్టదు, చాలాకాలం మన్నుతుంది, ఒకచోటి నుంచి ఇంకోచోటికి ఈజీగా కదిలించవచ్చు. దీనిపై 1 సంవత్సరం వారంటీ ఉంది. దీని ధర రూ.10,290, EMI ఆప్షన్ రూ.499 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మోడల్‌పై కూడా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్‌లోని ఈ డీల్స్‌తో మంచి క్వాలిటీ ఎయిర్ కూలర్‌ను తక్కువ ధరకే కొనేయొచ్చు. వేసవి ఎండలు తీవ్రం కాకముందే ఆఫర్లతో కూలర్ ఒక తెలివైన పని.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon offers deals on Bajaj, Symphony, Crompton air coolers with discounts and EMI. Beat summer heat with advanced features, large capacity coolers now.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X