Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...
ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఇప్పుడు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరుతో మరొక సేల్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20 వరకు జరిగే ఈ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది.

అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ముఖ్యంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ధర రూ.42,499
గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.42,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఎక్సినోస్ 990 SOC (4G) మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 (5G) చిప్ సెట్ లను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో అమర్చబడి ఉంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్లోని కెమెరా ఫీచర్లలో 3x ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ మరియు 4K వీడియో రికార్డింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
గెలాక్సీ S10 ప్లస్ రూ.52,999
గెలాక్సీ S10 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ప్రస్తుతం అమెజాన్ లో రూ.52,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్, 6.4-అంగుళాల క్వాడ్ హెచ్‌డి + కర్వ్డ్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే HDR10 + మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ శామ్‌సంగ్ ఎక్సినోస్ 9820 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 8GB / 12GB RAM మరియు 128GB / 512GB / 1TB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై మరియు సామ్‌సంగ్ స్కిన్ తో రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ను 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ టెలిఫోటో లెన్స్ కెమెరాలతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇవి 10X డిజిటల్ జూమ్ మరియు 0.5X / 2X ఆప్టికల్ జూమ్ ను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో కూడా డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.9 ఎపర్చర్‌తో 10 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇది 4100 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతుతో పాటు వైర్డు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటి వేగవంతమైన ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G ధర రూ.1,05,999
శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.1,05,999 ధర వద్ద మరియు 16GB ర్యామ్ + 512GB వేరియంట్ రూ.1,16,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ మొదటి సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో 120 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి) ఉంటుంది. కెమెరా సెటప్ 12, 10 మెగాపిక్సెల్ ప్రైమరీ డ్యూయల్ పిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్, హైబ్రిడ్ ఆప్టిక్ 3X జూమ్ మరియు ఎఫ్ / 2.0 లెన్స్ ద్వారా 76 డిగ్రీల ఎఫ్‌ఓవి కలిగిన 64 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 80 డిగ్రీల ఎఫ్‌ఓవి 40 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది USB PD 3.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 25W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 అలాగే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ పవర్ షేర్ కూడా ఉంది.
గెలాక్సీ S20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర రూ.76,999
గెలాక్సీ S20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.76,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ HD డిస్‌ప్లే 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 1440 × 3200 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు శామ్‌సంగ్ యొక్క సొంత ఎక్సినోస్ 990 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f / 2.2 సెన్సార్ తో కలిగి ఉంది.


Click it and Unblock the Notifications