Home
Deal of the day

అమెజాన్‌ టెలివిషన్ స్టోర్లో ఈ టీవీలపై ఎన్నడూలేని డిస్కౌంట్ ఆఫర్స్...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022 సంవత్సరంలో ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు మరింత ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ లో టెలివిషన్ స్టోర్స్ యొక్క ప్రత్యేక సేల్స్ ను నిర్వహిస్తోంది. ఇందులో స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప డిస్కౌంట్లను అందిస్తున్నది. అమెజాన్ నేటి విక్రయ సమయంలో సిటీ బ్యాంక్ మరియు యస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Television Store Offers 55% Off on OLED and QLED Smart TVs

Redmi 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV X43 ధర రూ.29,499

Redmi 4K X43 అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV ఇప్పుడు అమెజాన్ లో మొదటి సారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. రూ.29,499 ధర వద్ద లభించే ఈ టీవీ 43 అంగుళాల డిస్ప్లేని 4K అల్ట్రా HD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 178 డిగ్రీల విస్తృత వీక్షణను కలిగి ఉంటుంది. తాజా గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు, సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ TV 10తో రన్ అవుతూ IMDb ఇంటిగ్రేషన్‌తో ప్యాచ్‌వాల్ 4, క్వాడ్ కోర్ ప్రాసెసర్, అంతర్నిర్మిత Wi-Fi, అంతర్నిర్మిత Chromecast , Ok Google, ఆటో లెస్ లాటెన్సీ మోడ్, 2GB RAM + 16GB స్టోరేజ్ మరియు ప్రైమ్ వీడియో, Netflix, Disney + Hotstar, YouTube, Apple TV మరియు Play Store నుండి 5000+ యాప్‌లకు మద్దతు గల స్మార్ట్ టీవీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

అమెజాన్ బేసిక్ 55-ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV

అమెజాన్ బేసిక్139cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV AB55U20PS నలుపు వేరియంట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క కనెక్టివిటీ ఎంపికలలో సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI 2.0 పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB 3.0 మరియు 1 USB 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. అలాగే సౌండ్‌బార్లు, రిసీవర్‌లు మరియు సెట్ టాప్ బాక్స్‌లు వంటి కనెక్ట్ చేయబడిన పరికరాలను నియంత్రించడానికి IR పోర్ట్ కూడా అదనంగా ఉంది.

Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD TV

Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ ప్రస్తుతం అమెజాన్ లో రూ.36,990 ధర వద్ద లభిస్తుంది. ఇది సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే స్పీకర్లు లేదా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు లేదా ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB పోర్ట్‌లను కలిగి ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో క్రిస్టల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. మరియు ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 మరియు మరిన్నిటి వీక్షణను అనుమతిస్తుంది. అంతేకాకుండా PC మోడ్, యూనివర్సల్ గైడ్, వెబ్ బ్రౌజర్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి.

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 3,840x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో వచ్చే 60W స్పీకర్‌లతో జత చేయబడింది. TV యొక్క ఇతర స్మార్ట్ ఫీచర్లలో స్క్రీన్ షేర్ మరియు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వినియోగదారులు రెండు HDMI పోర్ట్‌లు మరియు ఒక USB పోర్ట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇప్పుడు అమెజాన్ లో రూ.45,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ లో టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఇది బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపుతో వస్తుంది. అలాగే రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 54,999.

OnePlus 108 cm 43 అంగుళాల Y సిరీస్ పూర్తి HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

OnePlus బ్రాండ్ యొక్క 43-అంగుళాల Y సిరీస్ ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు అమెజాన్‌లో రూ.27,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీలో బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్, 20 వాట్స్ డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ 9.0, వన్‌ప్లస్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్ మరియు హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. అదనంగా, TV ప్లే స్టోర్, Chromecast మరియు షేర్డ్ ఆల్బమ్‌తో వస్తుంది.

English summary
Amazon Television Store Offers 55% Off on OLED and QLED Smart TVs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X