Home
Deal of the day

అమెజాన్‌లో అలెక్సా ఇన్-బిల్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!!

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రస్తుతం బ్రహ్మాండమైన అనేక ఆఫర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ పద్దతిలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడే వారికి ఇది గొప్ప సువర్ణ అవకాశం. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఇప్పుడు సర్వసాధారణం అయింది. మరొకరికి పూర్తిగా బిన్నంగా ఉండాలని చూసే వారు ఇన్-బిల్ట్ అలెక్సా వాయిస్ ఫీచర్స్ గల స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఇటువంటి స్మార్ట్‌ఫోన్‌లతో యూజర్లు కేవలం తమ యొక్క వాయిస్ కమాండ్లతో సులభంగా ఫోన్ ని ఆపరేట్ చేయవచ్చు. అమెజాన్ యొక్క డీల్ అఫ్ ది డే విభాగంలో ఈ ఫీచర్స్ గల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది.అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి రూ.4,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Todays Deals Offers Huge Discounts on Alexa Built-in Smartphones

Xiaomi 11 Lite NE 5G రూ.22,499

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

షియోమి 11T ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రూ.39,999

షియోమి 11T ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.39,999 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.41,999. చివరిగా టాప్-ఆఫ్-ది-లైన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.43,999. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) 10-బిట్ ట్రూ-కలర్ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది మరియు 480Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది మరియు గరిష్ట ప్రకాశాన్ని 1,000 నిట్‌ల వరకు అందిస్తుంది. హుడ్ కింద, Xiaomi 11T Pro 5G ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 888 SoCని కలిగి ఉంది, Adreno 660 GPUతో జత చేయబడింది మరియు 12GB వరకు LPDDR5 RAM. 3GB వర్చువల్ RAM విస్తరణకు కూడా మద్దతు ఉంది.

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

Oneplus nord CE 5G ధర రూ. 29,999

OnePlus Nord CE 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్‌హెచ్‌డి+తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 65W వార్ప్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మోనో కెమెరా వంటివి ఉన్నాయి.

వన్‌ప్లస్ 9R‌ 5G ధర రూ.39,999

వన్‌ప్లస్ 9R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మీకు కేవలం 15 నిమిషాల్లోనే ఒక రోజు మొత్తానికి కావలసిన ఛార్జీని పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వన్‌ప్లస్ 9R 5G ఫోన్ వెనుక భాగంలో 48MP సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌తో నడిచే అధునాతన క్వాడ్-కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 16MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ మరియు అంకితమైన మోనో షూటర్ కూడా ఉన్నాయి.

English summary
Amazon Today's Deals Offers Huge Discounts on Alexa Built-in Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X