అమెజాన్‌లో "డీల్ అఫ్ ది డే" విభాగంలో వన్‌ప్లస్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ కోసం అనువైనదిగా ఉంది. ఇండియాలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి చాలా మంది ఆన్‌లైన్ పద్దతిలో కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. అటువంటి కస్టమర్‌ల కోసం అమెజాన్ ప్రతి రోజు డీల్ అఫ్ ది డే విభాగంలో కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌టీవీల కొనుగోలు మీద కొన్ని తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. వన్‌ప్లస్ బ్రాండ్ యొక్క కొత్త టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి 20% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 4K రిజల్యూషన్ ప్యానెల్స్‌ను 3,840x2,160 పిక్సెల్స్, 10-బిట్ కలర్ డెప్త్ మరియు 93 శాతం DCI-P3 కవరేజ్‌తో ఒరిజినల్ సినిమాటిక్, HDR10, HLG మరియు HDR10 + లను అందించే టాప్-ఆఫ్-ది-లైన్ 4K UHD డిస్ప్లే, డెల్టా E2 రేటింగ్ మరియు 10-బిట్ కలర్ డెప్త్‌తో కలర్ వైబ్రాన్సీ మరియు సినిమాటిక్ విజువల్స్ ఫీచర్స్ తో లభిస్తాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ. 52,890 ధరతో ఉంది, ఇది దాని అసలు ధర రూ. 59,999 నుండి తగ్గింది. స్మార్ట్ టీవీ అనేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో సహా 7.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.
OnePlus 108 cm 43 అంగుళాల Y సిరీస్ పూర్తి HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
OnePlus బ్రాండ్ యొక్క 43-అంగుళాల Y సిరీస్ ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు అమెజాన్‌లో రూ.27,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేలో రన్ అవుతుంది. ఇది 40-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్ప్లేని 1920x1,080 పిక్సెల్స్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో స్లిమ్ బెజెల్స్ నిర్మాణంతో వస్తుంది. అంతకాకుండా ఇది 93 శాతం DCI-P3 కలర్ స్పేస్ కవరేజీని కలిగి ఉంది. ఇది సంస్థ యొక్క గామా ఇంజిన్‌తో రన్ అవుతూ వీడియో కంటెంట్ యొక్క రియల్-టైమ్ ఆప్టిమైజేషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్, 20 వాట్స్ డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ 9.0, వన్‌ప్లస్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్ మరియు హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. అదనంగా, TV ప్లే స్టోర్, Chromecast మరియు షేర్డ్ ఆల్బమ్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ Y1 32-ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ
వన్‌ప్లస్ 32-ఇంచ్ Y1 ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద కేవలం బ్లాక్ కలర్ లో అందించబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేలో రన్ అవుతుంది. ఇది 32-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్ప్లేని 1920x1,080 పిక్సెల్స్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో స్లిమ్ బెజెల్స్ నిర్మాణంతో వస్తుంది. అంతకాకుండా ఇది 93 శాతం DCI-P3 కలర్ స్పేస్ కవరేజీని కలిగి ఉంది. ఇది సంస్థ యొక్క గామా ఇంజిన్‌తో రన్ అవుతూ వీడియో కంటెంట్ యొక్క రియల్-టైమ్ ఆప్టిమైజేషన్‌ను అందిస్తుంది. ఇది 64-బిట్ ప్రాసెసర్‌తో పనిచేస్తూ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇది 20W డాల్బీ ఆడియో మద్దతుతో రెండు ఛానల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు యాక్సిస్ ను అందించడంతో పాటుగా అంతర్నిర్మిత Chromecast ఫీచర్ ను కలిగి ఉంది. వన్‌ప్లస్ టీవీ 32 Y1 అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు మద్దతును ఇస్తుంది.
Oneplus nord 2 ధర రూ. 29,999
OnePlus Nord 2 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 మరియు 6GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 27,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్‌హెచ్‌డి+తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, మరియు 65W వార్ప్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో సహా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మోనో కెమెరా.


Click it and Unblock the Notifications