Home
Deal of the day

షియోమి బ్రాండ్ ల్యాప్‌టాప్ల కొనుగోలుపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ఇండియాలో కాలేజీలు మరియు స్కూలులకు సమ్మర్ సెలవులు ప్రారంభం అవ్వడంతో పిల్లలు అందరు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సెలవులలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలి అని ఆలోచన ఉంటుంది. ఏదైనా కొత్త విషయాలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ కంటే కూడా ల్యాప్‌టాప్ మెరుగ్గా ఉంటుంది. ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులకు మెరుగైన గొప్ప ఆఫర్లను అందిస్తున్నది.

Amazon Todays Deals Offers More Discounts on Xiaomi Brand Laptops

ఆన్‌లైన్ లో కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం అమెజాన్ తన సైట్ లోని ల్యాప్‌టాప్ స్టోర్ విభాగంలో షియోమి బ్రాండ్ ల్యాప్‌టాప్ల కొనుగోలు మీద డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ లో ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ రోజువారి డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా ల్యాప్‌టాప్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. ఈ విక్రయ సమయంలో HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.3,500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.55,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3K రిజల్యూషన్ తో 15.6-అంగుళాల (39.62 సెం.మీ.) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5-11300H 11వ జెనరేషన్ తో రన్ అవుతూ 3.1 GHz(బేస్) - 4.4 GHz(గరిష్టంగా) 4 కోర్లను కలిగి ఉంటుంది. విండోస్11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2021 సాఫ్ట్‌వేర్ లతో రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ లను కలిగి ఉంటుంది.

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.34,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ మరియు 11వ Gen వద్ద రన్ అవుతూ 8 GB ర్యామ్ మరియు 256 GB SSD లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 15.6-అంగుళాల(39.62 సెం.మీ.) FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Windows 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2019 సాఫ్ట్‌వేర్ లతో పాటుగా DTS ఆడియో ప్రాసెసింగ్ ను కలిగి ఉంటుంది. అలాగే 2 సూపర్‌స్పీడ్ USB టైప్-A 5Gbps, 1 RJ-45 , 1 HDMI వంటి పోర్ట్‌లను కలిగి ఉండి 1 SD కార్డ్ రీడర్, 1 హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ కాంబో, 1 USB 2.0 టైప్ A వంటి మరిన్ని పోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.

Mi నోట్‌బుక్ ప్రో థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్

Mi నోట్‌బుక్ ప్రో థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.54,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i5-11300H 11వ Gen వద్ద రన్ అవుతూ 14 అంగుళాల QHD+ IPS యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను సన్నని మరియు తేలికపాటి డిజైన్ తో వస్తుంది. ఇది 8GB ర్యామ్ 512GB SSD మరియు Iris Xe గ్రాఫిక్స్ లతో పాటుగా విండోస్11/MS ఆఫీస్ 21 మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉంటుంది.

Lenovo Ideapad 3 AMD Ryzen 5 5500U 15.6" FHD థిన్ & లైట్ ల్యాప్‌టాప్

Lenovo Ideapad 3 AMD Ryzen 5 5500U 15.6" FHD థిన్ & లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.48,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 512GB SSD మెమొరీని కలిగి ఉంటుంది. అలాగే ఇది విండోస్11, ఆఫీస్ 2021 ద్వారా రన్ అవుతూ బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఫీచర్లతో 2Yr వారంటీతో లభిస్తుంది. 3-సెల్ 45Wh బ్యాటరీని కలిగి ఉండి 7 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇందులోని వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ 1 గంటలో 80% వరకు ఛార్జ్ చేయగలదు. అంతర్నిర్మిత కెమెరాతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే మైక్రోఫోన్ ను కలిగి ఉంటుంది.

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్ ధర రూ.39,999

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.39,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్ తో రన్ అవుతూ 14 అంగుళాల FHD డిస్ప్లైను కలిగి ఉంటుంది. ఈ బిజినెస్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉన్నప్పుడు Windows 11కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అప్‌గ్రేడ్ రోల్‌అవుట్ ప్లాన్ 2021 చివరిలో ప్రారంభమై 2022 వరకు కొనసాగడానికి షెడ్యూల్ చేయబడింది. నిర్దిష్ట సమయం పరికరాన్ని బట్టి మారుతుంది. ఇది 8GB (4GB ఆన్‌బోర్డ్ + 4GB SO-DIMM) DDR4 3200MHz RAM, 1x SO-DIMM స్లాట్‌ని ఉపయోగించి 12GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. అలాగే స్టోరేజ్ 256GB M.2 NVMe PCIe SSD ఖాళీ 1x 2.5-అంగుళాల SATA స్లాట్‌తో లభిస్తుంది. అలాగే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కలిగి ఉండి జీవితకాల చెల్లుబాటుతో విండోస్10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రీ-లోడ్ చేయబడి వస్తుంది. ఇది రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

English summary
Amazon Today's Deals Offers More Discounts on Xiaomi Brand Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X